Site icon NTV Telugu

Viral: కిలో తగ్గితే వెయ్యి కోట్లిస్తానని సవాల్.. బరువు తగ్గేందుకు ఎంపీ కసరత్తు

Mp Anil Firojiya

Mp Anil Firojiya

ఫిట్‌నెస్‌ గురించి రకరకాల చాలెంజ్‌లు విసురుకున్నారు.. కేంద్ర మంత్రుల నుంచి బాలీవుడ్‌ స్టార్ట్స్‌, క్రికెటర్లు, ఇతర ప్రముఖులు కూడా ఈ చాలెంజ్‌లో పాల్గొనడం.. మరికొందరికి సవాల్‌ విసరడం.. ఆ మధ్య తెగ ట్రెండ్‌ అయ్యింది.. అయితే, ఇప్పుడు.. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఓ ఎంపీకి విసిరిన చాలెంజ్‌ చర్చగా మారింది.. బరువు తగ్గాలని సూచించిన గడ్కరీ.. కిలోకి వెయ్యి కోట్ల చొప్పున ఇస్తానంటూ ఆ ఎంపీకి సవాల్‌ చేశారు.. దీంతో, తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు రాబట్టేందుకు భారీ కసరత్తులు ప్రారంభించారు ఎంపీ అనిల్‌ ఫిరోజియా.. బరువు తగ్గేందుకు ఆయన చేస్తున్న కసరత్తులు.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి..

Read Also: Vallabhaneni: యార్లగడ్డవి రంగుల కలలు.. ఆయనదేమైనా మహేష్ బాబు ముఖమా..?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉజ్జయిని లోక్‌సభ సభ్యుడు అనిల్ ఫిరోజియా తన నియోజకవర్గం అభివృద్ధికి నిధుల కోసం ఆ మధ్య కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిశారు.. నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.. అయితే, ఎంపీ అనిల్‌​ఫిరోజియాకి ఒక షరతు విధించారు గడ్కరీ.. తాను నిధులు మంజూరు చేయాలంటే ముందు మీరు బరువు తగ్గాలని.. అప్పుడే నిధులు మంజూరు చేస్తానంటూ ఓ షరతు పెట్టారు.. అంతేకాదు.. తాను ఏవిధంగా బరువు తగ్గానో కూడా ఈ సందర్భంగా గడ్కరీ వివరించారు.. గతంలో నేను 135 కిలోలు బరువు ఉంటే.. ప్రస్తుతం 93 కిలోలకి తగ్గానని తెలిపారు.. మీరు కూడా బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి.. మీరు తగ్గిన ప్రతి కిలో బరువుకి వెయ్యి కోట్లు చొప్పున నిధులు మంజూరు చేస్తాననంటూ సవాల్‌ విసిరారు..

ఇక, అటు ఆరోగ్యం.. ఇటు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కూడా భారీగా వచ్చే అవకాశం ఉండడంతో.. ఫిట్‌నెస్‌ పై దృష్టి పెట్టారు ఎంపీ అనిల్‌ ఫిరోజియా.. బరువు తగ్గేడమే లక్ష్యంగా పెట్టుకుని కసరత్తులు చేస్తున్నారు.. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల నాటికి బరువు తగ్గి గడ్కరీని కలిసి మీ చాలెంజ్‌ని నెరవేర్చానని గుర్తుచేస్తానని.. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకొస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.. మొత్తంగా ఇప్పుడు మన ఎంపీగారు చేస్తున్న కసరత్తులకు సంబంధించిన వీడియో.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తోంది.

Exit mobile version