Tomato: కాపురంలో చిచ్చు పెట్టిన టమోటా.. మొగుడిని వదిలేసిన భార్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెరిగిన టమోటా ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.. టమోటాలతో చేసే వంటలను పూర్తిగా చేసుకోవడం మానేశారు.. ప్రస్తుతం మార్కెట్ లో ధరలు రూ.200 పలుకుతుంది.. ఇక దీంతో గృహిణులు ఆచితూచి చూసి టమోటా తో వంటను వినియోగిస్తున్నారు. పలు చోట్ల టమాట చోరీలు, హత్యలు జరుగుతున్నాయి కూడా. తాజాగా ఓ కుటుంబంలో టమాట చిచ్చురేపింది. భార్యకు తెలియకుండా భర్త కూరలో టమాట వేశాడనీ మనస్థాపం చెందిన భార్య అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భార్య ఎంతకీ తిరిగిరాక పోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. దాంతో ఈ ఘటన వెలుగు చూసింది…
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ షాదోల్ జిల్లాలో ధన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని బెమ్‌హోరి గ్రామానికి చెందిన సందీప్ బర్మన్ చిన్న దాబాను నడుపుతున్నాడు. రెండు రోజుల క్రితం కూరలు చేస్తున్న సమయంలో.. సందీప్ భార్యకు తెలియకుండా టమాటా వినియోగింగాడు. దీంతో మనస్తాపం చెందిన భార్య కోపంతో చిన్న కూతురుని తీసుకుని పుట్టింటికి వెళ్లింది.. భార్య ఎన్ని రోజులైనా తిరిగి రాకపోవడంతో భర్త చేసేదిలేక సందీప్ ధన్‌పురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు..
Also Read
- Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
- 540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!
ఇక పోలీసులు ఆమె ఫోన్ నెంబర్ ను తీసుకొని ట్రేస్ చేశారు.. ఉమరియాలోని తన సోదరి ఇంట్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి దంపతులిద్దరికీ సర్దిచెప్పి పంపించినట్లు ధన్‌పురి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి సంజయ్ జైస్వాల్ తెలిపారు. పెరుగుతున్న టమాటా ధరలతో సామాన్యులే కాదు.. బంధాలు కూడా తెగిపోతున్నాయని అంటున్నారు.. ధరలు గొడవలు పెడుతున్న.. రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్న ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోక పోవడంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.. వెంటనే ఏదొక నిర్ణయం తీసుకోవాలని సదరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..
తాజావార్తలు
-
Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
-
Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
-
Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!