పెరిగిన టమోటా ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.. టమోటాలతో చేసే వంటలను పూర్తిగా చేసుకోవడం మానేశారు.. ప్రస్తుతం మార్కెట్ లో ధరలు రూ.200 పలుకుతుంది.. ఇక దీంతో గృహిణులు ఆచితూచి చూసి టమోటా తో వంటను వినియోగిస్తున్నారు. పలు చోట్ల టమాట చోరీలు, హత్యలు జరుగుతున్నాయి కూడా. తాజాగా ఓ కుటుంబంలో టమాట చిచ్చురేపింది. భార్యకు తెలియకుండా భర్త కూరలో టమాట వేశాడనీ మనస్థాపం చెందిన భార్య అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భార్య ఎంతకీ తిరిగిరాక…