Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Titanoboa: ఊహించుకోండి.. దట్టమైన అడవిలో మీరు నడుస్తుండగా, హఠాత్తుగా మీ ముందు 50 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, వెయ్యి కిలోల కంటే ఎక్కువ బరువున్న ఒక భారీ పాము ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? మన ఇంట్లోని గది తలుపు గుండా అది లోపలికి రావాలంటేనే శరీరాన్ని నొక్కిపెట్టి రావాల్సినంత భారీ కాయం దానిది. వినడానికి ఏదో హాలీవుడ్ గ్రాఫిక్స్ సినిమా కథలా అనిపించినా, ఇది కోట్ల సంవత్సరాల క్రితం మన భూమిపై నిజంగానే బతికిన టైటానోబోవా (Titanoboa) అనే రాక్షస పాము నిజ జీవిత కథ ఇది. భూగోళంపై ఇప్పటివరకు జీవించిన పాములన్నింటిలోకి ఇదే అత్యంత పెద్దదిగా సైంటిస్టులు నిర్ధారించారు.
సుమారు 6.5 కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్ల యుగం అంతమైపోయింది. ఆ తర్వాత, సముద్రాలను శాసించిన మెగాలోడాన్ అనే భారీ షార్క్ వచ్చేంతవరకు (అంటే దాదాపు 2.3 కోట్ల సంవత్సరాల క్రితం వరకు) భూమిపై తిరుగులేని ఏకైక అగ్రగామి వేటగాడు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఈ టైటానోబోవానే. అప్పట్లో నదులు, చిత్తడి నేలలు, దట్టమైన అడవులకు ఇది అప్రకటిత రాజు. ఈ అద్భుతమైన జీవికి సంబంధించిన శిలాజాలు (fossils) దక్షిణ అమెరికాలోని కొలంబియాలో ఉన్న ఒక బొగ్గు గనిలో బయటపడ్డాయి. దాదాపు 5.8 కోట్ల సంవత్సరాల నాటి ఆ శిలలను పరిశోధించిన శాస్త్రవేత్తలకు, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఉష్ణమండల వర్షారణ్యాల (Tropical rainforests) ఉనికి తెలిసింది.
Also Read
- Guinness World Record: 44 ఏళ్ల 'యాష్లే పాల్సన్' సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
- Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
- Lucknow: ఛీ.. ఛీ.. చనిపోయిన కూడా వదల్లేదు.! తండ్రి మృతదేహంతో కొడుకు దారుణం.. వీడియో వైరల్.!
- Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
అయితే, ఇంత పెద్ద పాము అప్పట్లో ఎలా బతికింది? ఇప్పుడున్న అనకొండలు, కొండచిలువలు అంత పెద్దగా ఎందుకు పెరగడం లేదు? అనే సందేహం రావడం సహజం. దీనికి క్లైమేట్ చేంజ్, ఉష్ణోగ్రతలే కారణమని సైంటిస్టులు సమాధానం ఇస్తున్నారు. టైటానోబోవా ఒక శీతల రక్త జంతువు (Cold-blooded animal). అంటే, దాని శరీర ఉష్ణోగ్రత చుట్టుపక్కల ఉండే వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. ఆ కాలంలో దక్షిణ అమెరికా వాతావరణం ఇప్పటికంటే దాదాపు 10 డిగ్రీల ఫారెన్‌హీట్ ఎక్కువగా, అంటే చాలా వేడిగా ఉండేది. ఆ తీవ్రమైన ఉష్ణోగ్రతలే దాని శరీరం అంత అసాధారణంగా ఎదగడానికి, అంతటి బలాన్ని పుంజుకోవడానికి సహాయపడ్డాయట.
ఈ రాక్షస పాము ఎంత ప్రమాదకరమైనదో ఊహించడం కూడా కష్టమే. ఇప్పుడున్న అనకొండలు, పెద్ద కొండచిలువలు తమ శత్రువులను చుట్టేసి, ఊపిరాడకుండా చేసి ఎలా చంపుతాయో… టైటానోబోవా కూడా సరిగ్గా అదే పద్ధతిని ఫాలో అయ్యేది. కాకపోతే, దానికున్న 50 అడుగుల పొడవు, టన్ను బరువు, అత్యంత శక్తివంతమైన కండరాల ముందు అడవిలోని ఎంతటి భారీ జంతువులైనా క్షణాల్లో నలిగి ప్రాణాలు వదిలేసేవి. ఈ జీవి గనుక ఈరోజుల్లో బతికి ఉంటే, ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన నైట్‌మేర్‌గా మిగిలిపోయేది.
మరి ప్రస్తుత గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమి మళ్లీ వేడెక్కుతోంది కదా, భవిష్యత్తులో ఇలాంటి భారీ పాములు మళ్లీ పుట్టుకొచ్చే అవకాశం ఉందా? అంటే, థియరిటికల్‌గా వాతావరణం వేడెక్కితే పాముల పరిమాణం పెరిగే ఛాన్స్ ఉన్నప్పటికీ, ప్రాక్టికల్‌గా అది అసాధ్యం అని శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే, అంత పెద్ద జీవులు బతకడానికి అవసరమైన దట్టమైన అడవులు, విశాలమైన చిత్తడి నేలలు ఇప్పుడు వేగంగా అంతరించిపోతున్నాయి. పైగా భూమిపై మనుషుల సంచారం, ఆధునిక ఆక్రమణలు వాటిని అస్సలు మనుగడ సాగించనివ్వవు. అన్నింటికంటే ముఖ్యంగా, టైటానోబోవా కాలంలో ఉష్ణోగ్రతలు లక్షల సంవత్సరాల పాటు చాలా నెమ్మదిగా పెరిగాయి. కానీ ప్రస్తుత గ్లోబల్ వార్మింగ్ చాలా వేగంగా జరిగిపోతోంది. ఏది ఏమైనప్పటికీ, టైటానోబోవా కేవలం ఒక పెద్ద పాము మాత్రమే కాదు.. డైనోసార్ల తర్వాతి ప్రపంచాన్ని తన గుప్పిట్లో ఉంచుకుని ఏలిన భూగోళ చరిత్రలోనే ఒక అజేయమైన మహా వేటగాడిగా చెబుతారు!!
తాజావార్తలు
-
OTR: దువ్వాడ శ్రీనివాస్ అడుగులు మళ్లీ వైసీపీ వైపు పడుతున్నాయా..?
-
AP High Court: విశాఖ డేటా సెంటర్‌పై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
-
Nakshathra : లవ్ యూ నాన్న, లవ్ యూ అమ్మ
-
Ravi Teja: ‘ఇరుముడి’ సక్సెస్ జోష్.. ‘శివ నువ్వు తోపు సామీ’.. స్టేజ్ పైనే డైరెక్టర్‌ను హత్తుకున్న మాస్ మహారాజా!
-
Mythri Ravi: ఫోన్లో రీల్స్ చూసినా ఏడుపొస్తోంది.. ‘అన్నమయ్య’ తర్వాత మళ్లీ ఇప్పుడే..
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!