ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ కేసులు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ముంబైలో కూడా ఇలాంటి కేసు ఒకటి బయటకు వచ్చింది. అయితే ఇక్కడ యువకుడి చాకచక్యం చూసి దుండగుడే నవ్వుకున్నాడు. కొంత సమయం తర్వాత స్కామర్ స్వయంగా ఫోన్‌ను డిస్‌కనెక్ట్ చేయవలసి వచ్చింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. జనాలు నవ్వు ఆపుకోలేక పోతున్నారు.
దుబాయ్‌లో దారుణం జరిగింది. భారతీయ యువకుడిని పాకిస్థానీయుల గుంపు అత్యంత దారుణంగా చంపేశారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో తల్లిదండ్రులు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కుటుంబం నివాసం ఉంటున్న ప్రజా భవన్లో బాంబు ఉన్నట్లు అజ్ఞాత వ్యక్తి 100కు డయల్ చేసి చెప్పడంతో రాష్ట్ర పోలీస్ శాఖ వెంటనే అప్రమత్తమయింది. ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీస్ అధికారులను రంగంలోకి దింపింది. హుటాహుటిన బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రజాభవన్కు చేరుకొని అడుగడుగున తనిఖీలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పంజాగుట్ట ఏసీపీ మనోహర్ కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి తన…
జేడీయూ అధినేత నితీష్‌కుమార్‌కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న నితీష్‌కు మోడీ అభినందనలు తెలిపారు. ఆదివారం సాయంత్రం 5గంటలకు ముఖ్యమంత్రిగా తొమ్మిదో సారి నితీష్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. నితీష్‌తో పాటు బీజేపీకి చెందిన ఇద్దరు ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే జేడీయూకు మద్దతిస్తున్న మరో ఆరుగురు కూడా మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా స్పీకర్ పదవి కూడా బీజేపీకే దక్కనున్నట్లు సమాచారం.