NTV Telugu Site icon

Traffic Challan: బైక్ లేదు.. కార్ డ్రైవ్ చేయలేదు.. అయినా ట్రాఫిక్ చలాన్.. ఇదేక్కడి విడ్డూరం సార్..

Traffic Challan

Traffic Challan

రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వెహికిల్స్ కు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్, బైక్ మీద వెళ్లేవారు అయితే హెల్మెట్, కారులో వెళ్లేవారు అయితే సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలనే రూల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉంటే రోడ్డు మీద ఏ ట్రాఫిక్ పోలీస్ మన వాహనాన్ని ఆపినా.. సంబంధిత పత్రాలు చూపించి రయ్ మని వెళ్లొచ్చు. ఇక ఇందులో ఏ ఒక్కటీ లేకపోయినా ట్రాఫిక్ పోలీసులకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అయితే దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలోని నోయిడాలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళకు బైక్ లేకపోయినా.. కారు నడపకూండనే ట్రాఫిక్ పోలీసులు చలానా వేశారు. అది చూసి ఆమె ఖంగుతిన్నారు. ఇదేం విచిత్రమని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read Also: Internet Apocalypse: రెండేళ్లలో “సోలార్ మాగ్జిమమ్”కి సూర్యుడు.. ఇంటర్నెట్ వ్యవస్థ ధ్వంసం అవుతుందా..?

గ్రేటర్ నోయిడాలోని హోషియార్ పూర్ పరిధిలో నివసించే శైలజా చౌదరీ అనే మహిళకు గత శుక్రవారం ఒక ఈ- చలాన్ వచ్చింది. ఆమెకు జూన్ 27 వ తేదీన గౌతమ్ బుద్ధ నగర్ ట్రాఫిక్ పోలీసులు రూ.1000 చలానా వేసినట్లు.. తన బైక్ కి రూ. 1000 జరిమానా విధించారు.. కానీ.. తన పేరు మీద అసలు ఎలాంటి బైక్ రిజిస్టర్ అయి లేదని శైలజా చౌదరీ తెలిపారు. తనకు కారు మాత్రమే ఉందని.. ఆ రోజు కారులో హోషియార్ పూర్ ప్రాంతంలో ప్రయాణించ లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది. అసలు తనకు బైకే లేకుండా.. కారులో ప్రయాణించకుండా ఎలా చలానా వేస్తారని ట్రాఫిక్ పోలీసులను ఆమె ప్రశ్నించింది.

Read Also: CM YS Jagan: కేబినెట్‌ భేటీలో సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎన్నికలకు సిద్ధంకండి..

తన పేరు మీద కేవలం హ్యూందాయ్ ఐ20 కారు మాత్రమే ఉందని.. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ చలాన్ వేశారని శైలజా చౌదరీ ఆరోపించారు. వెంటనే దాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటనపై ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రీతీ యాదవ్ రియాక్ట్ అయ్యారు. ట్రాఫిక్ చలానాలు వేసేందుకు తాము ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉపయోగిస్తామన్నారు.. దీని ద్వారా ఆటోమెటిక్‌గా వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ గుర్తిస్తుందన్నారు. అలాంటి సమయంలో చిన్న చిన్న పొరపాటుల వల్ల వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ తప్పుగా డిటెక్ట్ చేస్తుందని డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు. తప్పుగా ఉన్న చలానాలను తొలగిస్తామని ఆమె చెప్పారు.