సోషల్ మీడియా వాడకం విస్తృతంగా పెరిగిపోయినప్పటి నుంచి విచిత్రమైన ఉద్యోగాలు పుట్టుకొచ్చేశాయి. అయితే, ప్రతీ ఉద్యోగం వెనుక కాస్తోకూస్తో శ్రమ అనేది ఉంటుంది. సుఖంగా కూర్చోబెట్టి ఎవ్వరూ జీతం ఇవ్వరు. కానీ, ఓ సంస్థ మాత్రం అలాంటి సౌకర్యవంతమైన ఉద్యోగమే ఆఫర్ చేసింది. ఇంట్లోనే కూర్చొని వీడియోలు చూడాలంతే! అయితే, అవి సాధారణ వీడియోలు కావు, అడల్ట్ వీడియోలు. (మీకు అర్థమవుతోందా!)
‘బెడ్‌బైబిల్స్’ అనే ఓ అడల్ట్ వెబ్‌సైట్.. ఒక పోర్న్ రీసెర్చ్ ప్రాజెక్ట్‌కు హెడ్‌గా నియమించేందుకు ఇటీవల ఎంపికలు చేసింది. ఈ ఉద్యోగానికి ఏకంగా 90 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. చివరికి స్కాట్‌ల్యాండ్‌కు చెందిన 22 ఏళ్ల రెబెక్కా డిక్సన్ ఈ ఉద్యోగాన్ని సాధించింది. కేవలం పోర్న్ వీడియోలు చేయడమే ఈమె పని. ఒక్కో వీడియో వ్యవధి ఎంతుంది? సెక్స్ పొజిషన్స్? వాటిల్లో నటించిన నటీనటుల సామర్థ్యం.. ఇంకా మరిన్ని కొత్త విషయాల్ని కనిపెట్టి పేర్కొనాలి. వీటిపై ప్రత్యేకంగా ఎనాలసిస్ రాయాల్సి ఉంటుంది.
ఈ జాబ్‌కు గాను ఆ అమ్మాయి గంటకు 20 డాలర్లు ఇస్తోంది ఆ సంస్థ. మన భారతీయ కరెన్సీలో చూసుకుంటే.. రూ. 1562 అన్నమాట! 90 వేల మందిలో రెబెక్కా మాత్రమే ఎంపికైందంటే.. పోర్న్ వీడియోస్ చూడటంలో ఆమె ఎంత నిపుణురాలో అర్థం చేసుకోవచ్చు. ఈ జాబ్ చాలా విచిత్రంగానూ, అదే సమయంలో జుగుస్పాకరంగానూ అనిపిస్తోంది కదూ!