Virat Kohli: విరాట్ కోహ్లీ మొబైల్ వాల్‌పేపర్‌గా ఆయన ఫోటో.. ఎవరీయన?
- విరాట్ కోహ్లీ ఫోన్ వాల్‌పేపర్‌పై ఫోటో..
- ఆ వాల్‌పేపర్‌పై వున్నది నీమ్ కరోలి బాబా ఫోటో..
- ఆ బాబా చాలా శక్తివంతమైనవారు అని క్రికెట్ అభిమానులు చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: ముంబైలోని మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు ఓపెనర్ టాప్ బస్‌లో భారత క్రికెటర్లు టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో భారీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం వాంఖడే స్టేడియంలో క్రీడాకారులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ ఫోన్ వాల్‌పేపర్‌పై ఓ ఫోటో కెమెరా కంటికి చిక్కింది. ఇది తన సతీమణి అనుష్క దే కదా అనుకుంటే పొరపాటేనండోయ్. ఆ వాల్‌పేపర్‌పై వున్నది నీమ్ కరోలి బాబా ఫోటో. ఇంతకీ.. నీమ్ కరోలి బాబా ఎవరు? విరాట్ కోహ్లి లాంటి స్టార్ క్రికెటర్ వాల్‌పేపర్‌గా అతని చిత్రం ఉంటే, ఆ బాబా చాలా శక్తివంతమైనవారు అని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు.
Read also: Hyderabad Bonalu: జూలై 07 నుంచి ఆగష్టు 04 వరకూ బోనాలు..
Also Read
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
- Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
- Igho Ubiribo: ప్రైవేట్ పార్ట్ పరిమాణం పెంచే కాస్మెటిక్ ప్రక్రియ చివరకు ఈ ఇన్ఫ్లుయెన్సర్ ప్రాణాన్ని ఎలా తీసింది?
- Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
నీమ్ కరోలి బాబాను నీబ్ కరోరి బాబా అని కూడా అంటారు. కరోలి బాబా అసలు పేరు లక్ష్మణ్ దాస్. 1958లో లక్ష్మణ్ దాస్ తన సమయాన్ని ఆధ్యాత్మిక చింతనలో గడపడానికి ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ఆ సమయంలో టిక్కెట్టు లేకుండా రైలులో ప్రయాణిస్తుండడంతో కరోలి గ్రామ సమీపంలో టీటీ అతన్ని రైలు నుండి దింపేసింది. ఆ తర్వాత రైలు ముందుకు కదలదు. దీంతో సాధువును రైలు నుంచి దింపినందున రైలు కదలకపోవడంతో బాబాను ఎక్కించుకోవాలని ప్రయాణికులు సూచించడంతో టీటీ మళ్లీ రైలు ఎక్కించారు. అయితే.. రెండు షరతులతో బాబా మళ్లీ రైలు ఎక్కనున్నారు.

Read also: Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి వారాహి ఉత్సవాలు, సారె మహోత్సవాలు..
అదేమిటంటే.. కరోలి గ్రామంలో రైల్వేస్టేషన్ నిర్మించాలని రైల్వే అధికారులకు సిఫార్సు చేయడంతోపాటు సాధువులతో సామరస్యపూర్వకంగా వ్యవహరించాలని కోరారట. టీటీ వారికి అంగీకరించి, లక్ష్మణ్ దాస్ రైలు ఎక్కిన తర్వాత, రైలు ముందుకు కదులుతుంది. అతను కరోలి గ్రామంలో అడుగుపెట్టాడు మరియు అక్కడ కొంతకాలం ఉన్నాడు, అందుకే అతనికి నీమ్ కరోలి బాబా అని పేరు వచ్చింది. అయితే.. మహారాజ్ జీ అని కూడా పిలుస్తారు. ఈ బాబాను హనుమంతుని రూపమని నమ్ముతారు. ఉత్తరప్రదేశ్‌లోని కరోలి బాబాకు దేశవ్యాప్తంగా అనేక ఆశ్రమాలు, దేవాలయాలు ఉన్నాయి. ప్రధాన ఆశ్రమం నైనితాల్ నుండి 65 కి.మీ దూరంలో పంత్‌నగర్‌లో ఉంది. 1900లో జన్మించిన కరోలి బాబా 1973లో మరణించారు.
Bharateeyudu 2: భాగ్యనగరంలో ‘భారతీయుడు 2’ సందడి.. గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్
తాజావార్తలు
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!