Monkey Video: మనిషి కన్నా జంతువులకు ఎక్కువ విశ్వాసం ఉంటుంది అనేది పెద్దలు చెప్పిన సామెత.సాధారణంగా ఒక్కరోజు అన్నం పెడితే కుక్కలు విశ్వాసం చూపిస్తాయి అంటారు. కానీ ఇక్కడ ఒక కోతి తనకు ఒక్కరోజు అన్నం పెట్టాడని ఎంతో కృతజ్ఞత చూపించింది. అసలు ఏంజరిగిందంటే.. శ్రీలంక లోని తూర్పు ప్రావిన్స్‌లో బట్టికలోవా జిల్లాలో ఒక వ్యక్తి మృతి చెందాడు. చుట్టాలు, పక్కాలు, స్నేహితులు అందరూ ఆయన మృతదేహం వద్ద రోదిస్తున్నారు. ఇంతలోనే అక్కడకు ఒక కోతి వచ్చింది. ఈసమయంలో కోతి వచ్చింది.. అని వారెవ్వరు దాన్ని పక్కకు నెట్టలేదు.
ఇక ఆ కోతి చేసిన పనికి అక్కడున్నవారందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఒకప్పుడు ఈ కోతి ఆకలితో అలమటిస్తున్నప్పుడు మృతి చెందిన వ్యక్తి అన్నం పెట్టాడట.. అలా ఒక్కసారి అన్నం తిన్న విశ్వాసంతో కోతి అప్పుడప్పుడు ఆ ఇంటికి వస్తూ ఉండేది.. వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లో వారు కోతికి తినడానికి ఏదో ఒకటి ఇచ్చేవారట. ఇక తనకు అన్నం పెట్టిన వ్యక్తి మృతిచెందాడని చూసిన కోతి అతని మృతదేహం వద్ద కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంది. అతడికి ముద్దు పెట్టి.. నివాళులు అర్పించింది.. తాను వస్తే లేస్తాడేమో అని చేయి పట్టుకొని లేపాడానికి ప్రయత్నించింది. ఇక ఈ వీడియో చూసిన వారందరు ఆ కోతి ప్రేమకు ఫిదా అయిపోయారు. మనుషులు కూడా ఇలా ప్రేమించి వుండరు అని కంటనీరు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన వారందరు మనుషులు కంటే జంతువులకె విశ్వాసము ఎందుకు ఉంటుందో ఈ వీడియో చూస్తే తెలుస్తుందని కామెంట్స్ పెట్టుకొస్తున్నారు.
♦కొలంబో: తనకు అన్నం పెట్టిన వ్యక్తి చనిపోయాడని ఓ వానరం రోధించి అతడికి ముద్దు పెట్టి నివాళులర్పించిన దృశ్యాలు అందరి హృదయాలను కలచివేశాయి.
♦శ్రీలంక లోని తూర్పు ప్రావిన్స్‌లో బట్టికలోవా జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. pic.twitter.com/GINtQOIl7r— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) October 20, 2022