Lion Cow Viral Video: ఆవును కాపాడుకునేందుకు సింహానికి ఎదురెళ్లిన రైతు.. నీ ధైర్యానికి పెద్ద హ్యాట్సాఫ్ బాసూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video, Farmer Saves Cow From Lion: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు తమ పిల్లలతో పాటుగా పెంపుడు జంతువులను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వాటికి చిన్న ఇబ్బంది కలిగినా అస్సలు తట్టుకోలేరు. ఇక తమ పెంపుడు జంతువుకు ఆపద వస్తే ఊరుకుంటారా?.. తక్షణమే స్పందిస్తారు. ఎదురుగా ఎవరున్నా, ఎలాంటి జంతువు ఉన్నా.. అస్సలు వెనకడుగు వేయరు. ప్రాణాలకు తెగించి మరీ కాపాడుకుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే గుజరాత్‌లో చోటుచేసుకుంది. ఓ రైతు తన ఆవును కాపాడుకునేందుకు ఏకంగా సింహానికే ఎదురెళ్లాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం… రోడ్డుపై ఓ ఆవు గొంతును సింహం పట్టుకుంటుంది. నొప్పితో విలవిల్లాడిపోయిన ఆవు పెద్దగా అరుస్తుంటుంది. ఆవు అరుపులు విన్న యజమాని.. వెంటనే అక్కడికి పరుగెత్తుకొస్తాడు. ఆవు గొంతును సింహం పట్టుకొని ఉండడం చూసి కాస్త బయడతాడు. అయితే ఎలాగైనా తన ఆవును కాపాడుకోవాలని ముందడుగు వేస్తాడు. చెయ్యెత్తి పైకెత్తి గట్టిగా అరుస్తూ సింహాన్ని బయపెడుతాడు. అదే సమయంలో సింహం నుంచి తప్పించుకునేందుకు ఆవు ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలో ఆవు రోడ్డు పక్కకు జరుగుతుంది.
Also Read
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
రోడ్డు పక్కనే ఉన్న రాయి తీసుకుని సింహం వైపుగా రైతు వెళ్తాడు. రైతును చూసిన సింహం భయపడిపోయి ఆవు గొంతును విడిచిపెట్టి వెళ్లిపోతుంది. దాంతో ఆవు ప్రాణాపాయం నుంచి బయటపడుతుంది. ఈ వీడియోను ‘వివేక్ కొటాడియా’ అనే యూసర్ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. గుజరాత్‌లోని గిర్ సోమ్‌నాథ్ జిల్లా అలీదార్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పేర్కొన్నాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన వారు రైతు ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘నీ ధైర్యానికి పెద్ద హ్యాట్సాఫ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ગીર સોમનાથ જિલ્લાના આલીદર ગામે સિંહણ દ્વારા ગાય ઉપર હુમલો કરેલ ત્યારે ખેડૂતે #Credit કિરીટસિંહ ચૌહાણ પોતાની ગાયને એક ખમીરવંતો પ્રયાસ કરેલ અને સફળતા મળેલ.
ખુબ ખુબ સલામ#lion #animalattack #cow #lioness #kingofthejungle #hunt #wildlife #india #nationalgeographic #discovery pic.twitter.com/lDYGub9bfZ— Vivek Kotadiya Bjp (@VivekKotdiya) June 29, 2023
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!