NTV Telugu Site icon

Metro Viral Video : బట్టల్లేకుండా టవల్స్ ధరించి.. మెట్రోలో హల్‌చల్ చేసిన నలుగురు అమ్మాయిలు (వీడియో)

Viral Videos

Viral Videos

మెట్రోకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. ఢిల్లీ మెట్రోకు చెందిన వీడియోలైతే.. తరచూ చర్చలో ఉంటాయి. ఇటీవల వైరల్ అయిన వీడియోలో.. ఒక అమ్మాయి చిరిగిన దుస్తులతో మెట్రోలోకి ప్రవేశిస్తున్నట్లు కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని సృష్టించింది. ఇప్పుడు మరో మెట్రోకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కానీ ఈ వీడియో ఢిల్లీ మెట్రోకు సంబంధించింది కాదు.

READ MORE: Pushpa 2: పుష్ప 2 రిలీజ్ ముందు ‘శిల్పా’ బ్యానర్ ఆటలు!

వైరల్ అయిన వీడియోలో.. నలుగురు అమ్మాయిలు మెట్రోలో ప్రయాణిస్తున్నట్లు కనిపించింది. ఈ అమ్మాయిల డ్రెస్సింగ్ అందరినీ అశ్చర్య పరిచింది. ఎందుకంటే ఈ వీడియోలు వీరు ఎలాంటి డ్రెస్ వేసుకోలేదు. కేవలం తెల్లటి మందపాటి టవల్స్ మాత్రమే చుట్టుకున్నారు. అలాగే వాళ్లు మెట్రోలోకి ప్రవేశించారు. వీళ్లను చూసిన ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ అమ్మాయిలను వీడియో తీస్తున్న కెమెరా మ్యాన్ మెట్రోలో వీరి చేష్టలను గమనిస్తున్న ప్రయాణికులను కూడా క్యాప్చర్ చేశారు.

READ MORE:white hair : 30 ఏళ్ల వయసులోనే జుట్టు నెరిసిపోతుందా? కారణం ఏంటో తెలుసుకోండి ?

అయితే.. వీరిని చూసిన కొందరు అసహ్యించుకున్నారు. వీళ్లతో కొందరు సెల్ఫీలు సైతం దిగారు. మెట్రో హల్‌చల్ చేసిన ఈ యువకులను ప్రయాణికులు, వృద్ధులు, యువకులు అందరూ తమ మొబైల్ ఫోన్లులో ఫొటోలు, వీడియోలు తీయడం ప్రారంభించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. అమ్మాయిలు కూడా ఫొటోలకు పోజులిచ్చారు. ఈ వీడియో @mimisskate అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. దీన్ని ఇప్పటివరకు కొన్ని లక్షలకు పైగా వీక్షించారు. వేల మంది దీన్ని లైక్ చేసి షేర్ చేశారు. వీడియోపై భిన్న స్పందనలు వస్తున్నాయి. ‘ఈ ఆడవాళ్ళు బాత్‌రూమ్‌లోంచి నేరుగా మెట్రోకి వచ్చినట్లుంది’ అని ఓ వినియోగదారు కామెంట్ చేశారు. కాగా.. ఈ వీడియో విదేశీ మహిళలలకు చెందినది. ఈ మెట్రో ఏ దేశానికి చెందిందో స్పష్టత లేదు.