పడవపై నుంచి చేపలు పడుతున్న ఓ యువకుడికి అనూహ్యమైన ప్రమాదం తప్పింది. అతడు తన వలకు చిక్కిన పెద్ద చేపను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో, ఒక్కసారిగా నీటి అడుగున నుంచి ఓ భారీ మొసలి దూకి వచ్చింది. ఎవరికీ ఊహించని విధంగా ఆ మొసలి తన బలమైన దవడలతో ఆ చేపను పట్టుకుని క్షణాల్లోనే నీటిలోకి లాక్కెళ్లిపోయింది. ఈ అకస్మాత్తు ఘటనతో యువకుడు భయాందోళనకు గురై నివ్వెరపోయాడు.
ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసినవారు కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రకృతిలో ప్రమాదాలు ఎంత అనూహ్యంగా ఎదురవుతాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. అయితే అదృష్టవశాత్తు ఆ యువకుడు వెంటనే తేరుకుని ప్రమాదం నుంచి బయటపడగలిగాడు.
ఈ ఘటనకు సంబంధించిన 37 సెకన్ల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోకు మూడు లక్షలకు పైగా వ్యూస్ రావడంతో పాటు నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. “తృటిలో ప్రమాదం తప్పింది… లేదంటే ఏమై ఉండేదో ఊహించలేం” అని ఒకరు కామెంట్ చేయగా, “చేపలు పట్టేటప్పుడు మొసళ్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి” అంటూ మరో నెటిజన్ హెచ్చరించారు.
Crocodile comes out of nowhere to snag the fish pic.twitter.com/XPW1wdwjiK
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) December 26, 2025