పడవపై నుంచి చేపలు పడుతున్న ఓ యువకుడికి అనూహ్యమైన ప్రమాదం తప్పింది. అతడు తన వలకు చిక్కిన పెద్ద చేపను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో, ఒక్కసారిగా నీటి అడుగున నుంచి ఓ భారీ మొసలి దూకి వచ్చింది. ఎవరికీ ఊహించని విధంగా ఆ మొసలి తన బలమైన దవడలతో ఆ చేపను పట్టుకుని క్షణాల్లోనే నీటిలోకి లాక్కెళ్లిపోయింది. ఈ అకస్మాత్తు ఘటనతో యువకుడు భయాందోళనకు గురై నివ్వెరపోయాడు. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసినవారు కూడా ఒక్కసారిగా షాక్‌కు…