NTV Telugu Site icon

Viral News: బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా.. సైబర్ నేరగాడికి ఉద్యోగం ఇచ్చిన కంపెనీ.. కట్‌ చేస్తే..

బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా కంపెనీ ఓ వ్యక్తికి ఉద్యోగం ఇచ్చింది. ఆ వ్యక్తి కంపెనీకి కంపెనీకి తప్పుడు వివరాలను అందించినట్లు కంపెనీ గుర్తించింది. ఆ వ్యక్తి ఓ సైబర్ నేరగాడని తేలడంతో ఆశ్చర్యానికి గురైంది. ఇంతే కాదు కంపెనీ సమాచారాన్ని దొంగిలించి డబ్బు డిమాండ్ చేశాడు సైబర్ నేరగాడు. యూకే , యూఎస్ ఆస్ట్రేలియాలో పనిచేస్తున్న కంపెనీ ఉత్తర కొరియా సైబర్ నేరస్థుడిని ఉద్యోగిగా నియమించుకుంది. దీంతో కంపెనీ వివరాలు మొత్తం దొబ్బేశాడు కేటుగాడు. ఉత్తర కొరియాకు చెందిన ఐటీ ఉద్యోగి నియామకానికి సంబంధించి ఈ ఘటన చోటు చేసుకుంది.

READ MORE: Vizianagaram: గొర్ల గ్రామంలో మరణాలపై సీనియర్ ఐఎఎస్ అధికారితో విచారణ..

ఓ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. ఉత్తర కొరియాకి చెందిన ఓ హ్యాకర్‌ను వేసవిలో కంపెనీ నియమించుకుంది. వర్క్‌ ఫ్రం హోం అవకాశం కల్పించింది. కేటుగాడు నాలుగు నెలల పాటు సంస్థలో పనిచేశాడు. కంపెనీ కంప్యూటర్ నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేసిన తర్వాత కంపెనీకి చెందిన కీలకమైన డేటాను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. నాలుగు నెలల తర్వాత డబ్బులు డిమాండ్ చేయడం ప్రారంభించాడు. తాను అడిగినంత నగదు ఇవ్వకుంటే సమాచారాన్ని బయట అమ్మేస్తానని కంపెనీని బెదిరించడం ప్రారంభించాడు.

READ MORE: Bihar: సన్యాసిగా భారత్‌లో నివసిస్తున్న బంగ్లాదేశీ.. బీహార్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్..

ఆ వ్యక్తి కార్పొరేట్ నెట్‌వర్క్‌లోకి లాగిన్ అవ్వడానికి సంస్థకు చెందిన రిమోట్ వర్కింగ్ టూల్స్‌ను ఉపయోగించాడని మీడియా సంస్థ తెలిపింది. వీలైనంత ఎక్కువ కంపెనీ డేటాను రహస్యంగా డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకున్నట్లు నివేదికలో పేర్కొంది. పనితీరు సక్రమంగా లేకపోవడంతో కంపెనీ ఆ ఉద్యోగిని తొలగించింది. భారీ మొత్తం చెల్లించాలని లేదంటే కంపెనీకి చెందిన కీలక సమాచారాన్ని బయట విక్రయిస్తానని ఆ ఉద్యోగి ఇమెయిల్‌లను పంపాడు. అయితే ఆ హ్యాక్ డిమాండ్ చేసిన నగదును ఇస్తుందా? లేక చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తుందో తెలియాల్సి ఉంది.

Show comments