చైనా సృష్టి: మొన్న కృత్రిమ సూర్యుడు… ఇప్పుడు కృత్రిమ చంద్రుడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచమంతా కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తుంటే చైనా మాత్రం కొత్త కొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతున్నది. ఇప్పటికే కృత్రిమ సూర్యుడిని సృష్టించిన చైనా తాజాగా కృత్రిమ చంద్రుడిని ఆవిష్కరించింది. భవిష్యత్తులో చంద్రుడిపై పరిశోధనలు చేయాలని చైనా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అక్కడికి వ్యోమగాములను పంపి పరిశోధనలు చేయాలి అంటే చంద్రుడిపై ఉన్న వాతారవణానికి వ్యోమగాములు అలవాటు పడాలి. అక్కడి వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించింది. భూమిపై ఉన్న గురుత్వాకర్షణ శక్తిలో ఆరోవంతు చంద్రునిపై ఉంటుంది. భూమిపై ప్రత్యేక పద్దతుల్లో చంద్రునిపై ఉండే విధంగా గురుత్వాకర్షణ శక్తిని సృష్టించింది. ఈ కృత్రిమ చంద్రుడిని చైనా జీయాంగ్సు ప్రావిన్స్‌లోని షుజౌ నగరంలో ఏర్పాటు చేశారు. మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ఆధారంగా చంద్రుడిపై గురుత్వాకర్షణను ఏర్పాటు చేశారు.
Read: మెగాభిమానుల్లో చిచ్చు రేపిన ఆర్జీవీ!
Also Read
- Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
- Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తాతా.. 18 వేల అడుగుల ఎత్తు నుంచి దూకేసిన 80 ఏళ్ల వృద్ధుడు!
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
ఈ కృత్రిమ చంద్రునిలో రెండు చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన గది, వ్యాక్యుమ్ చాంబర్ ఉన్నాయి. వ్యాక్యుమ్ చాంబర్లో శక్తివంతమైన అయస్కాంతాల సహాయంతో అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేసి గాలి లేకుండా చేశారు. ఈ గాలి లేని చాంబర్‌లోని వాతావరణానికి వ్యోమగాములు అలవాటు పడేలా చేస్తారు. 2027 వ సంవత్సరం నాటికి జాబిల్లిపైకి చాంగే 6,7,8 వ్యోమ నౌకలను పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఆ తరువాత 2030నాటికి జాబిల్లిపైకి మనుషులను పంపాలన్నది చైనా లక్ష్యం. దీనికోసమే చైనా ప్రయత్నాలు చేస్తున్నది.
- Tags
- Artificial Moon
- china
- Moon
- Sun
తాజావార్తలు
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
-
Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
-
Anirudh: బక్కోడు మాములోడు కాదుగా!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Rahul Samit: రాహుల్ సమిత్ మెరుపులు.. ద్రవిడ్ శైలి.. 360 డిగ్రీ బ్యాటింగ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?