టెక్నాలజీ పెరిగింది దాంతో జనాలు కూడా టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్నారు.. ఏదైనా అరచేతిలో కనిపించేలా స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వాడుతున్నారు.. అలాగే సోషల్ మీడియాను కూడా ఎక్కువగానే వాడుతున్నారు.. క్రేజ్ ను పెంచుకొనేందుకు కొందరు వింత ప్రయోగాలు చేస్తారు. అందులో కొన్ని సక్సెస్ అయిన కూడా కొన్నిటిని జనాలు ఫన్నీగా కామెంట్స్ చేస్తారు.. తాజాగా ఓ ఆటో డ్రైవర్ కూడా సోషల్ మీడియాలో తనకు ఎక్కువ ఫాలోవర్స్ రావాలని వినూత్న ఆలోచన చేశాడు.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
వివరాల్లోకి వెళితే.. ఉదయన్ అనే ఉద్యోగి ఆటో ఎక్కిన తర్వాత డ్రైవర్ సంభాషణ ప్రారంభించాడు. చాలా మంది ఆటో ఎక్కిన తర్వాత ఆటో రైడ్లను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారని, మీరు కూడా అలా చేయాలనుకుంటే తన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కనిపించేలా వీడియో రూపొందించాలని అడిగాడు. ఆ ఆటో డ్రైవర్ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఐడీ అతడి ఆటో ముందు భాగంలో ముద్రించి ఉంది. దీంతో ఉదయన్ అలాగే చేశాడు. ఆ వీడియోకు “పీక్ బెంగళూరు మూమెంట్“ అని టైటిల్ పెట్టాడు.. అదే ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది..
ఆ ఫొటోను ఇప్పటివరకు 5 వేల మందికి పైగా వీక్షించారు. ఆ ఆటో డ్రైవర్ చాలా స్మార్ట్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. సోషల్ మీడియా ఫీవర్ కొనసాగుతుంది.. ఏం ఐడియా బాసూ.. కొద్ది రోజుల్లోనే హీరో అవుతావు అంటూ రకరకాల కామెంట్స్ ను చేస్తున్నారు.. ఏది ఏమైనా ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టిన ఆటో డ్రైవర్ పై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు..