Site icon NTV Telugu

AAP’s Candidate video viral: తుపాకీ చూపిస్తూ ఆప్‌ నేత హల్‌చల్‌.. వీడియో వైరల్

Video Viral

Video Viral

అసలే ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల సమయంలో ఆమ్‌ఆద్మీ పార్టీ నేతులు, అభ్యర్థులు ఎలా దొరుకుతారు? అనే విధంగా భారతీయ జనతా పార్టీ నేతలు ఎదురుచూస్తున్నారు.. అయితే, మున్సిపల్‌ ఎన్నికలో ఆప్‌ తరపున బరిలోకి దిగుతోన్న సింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది.. ఆ వీడియోలో పసుపు రంగు టీ షర్ట్ ధరించి ఉన్న సింగ్.. కొంతమంది వ్యక్తులతో కలిసి డ్యాన్స్‌లు ఇరగదీశారు.. అంత వరకు బాగానే ఉంది అనుకుందాం.. కాసేపటి సడన్‌గా గన్‌ బయటకు తీసిన ఆయన.. తన సహచరులతో కలిసి రౌడీ మాదిరిగా హల్‌చల్‌ చేశాడు.. అయితే, ఎప్పుడు ఎక్కడ దొరుకుతారు అని వెయిట్‌ చేస్తున్న బీజేపీకి.. ఇప్పుడు ఆ వీడియో ఒక హస్త్రంగా మారిపోయింది.. ఆ వీడియోను తెగ వైరల్‌ చేస్తున్నారు.

Read Also: AP CM Jaganmohan Reddy: సీఎం జగన్‌ రెండు రోజుల వైఎస్సార్‌ కడప జిల్లా పర్యటన ఖరారు

ఇక, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్‌సీడీ ఎన్నికల అభ్యర్థి జోగిందర్ సింగ్‌పై కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు.. పిస్టల్‌ను ప్రదర్శించినందుకు ఆయుధాల చట్టం అతిక్రమణ కింద కేసు నమోదు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. కొంతమంది వ్యక్తులతో కలిసి డ్యాన్స్ చేస్తున్నప్పుడు సింగ్.. పిస్టల్ ఊపుతూ.. గురిపెడుతున్నట్టు.. చూపిస్తూ చిందులు వేశారు.. అయితే, ఆ వీడియో వైరల్ అయ్యింది.. వైరల్ వీడియోను సుమోటోగా గుర్తించి, జోగిందర్ సింగ్‌పై మంగళవారం ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశారు.. తదుపరి దర్యాప్తు జరుపుతోందని పోలీసు అధికారి వెల్లడించారు.. కాగా, జోగిందర్ సింగ్.. స్వరూప్ నగర్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. డిసెంబర్ 4న 250 వార్డులకు విస్తీర్ణంలో ఉన్న సివిల్ ఎన్నికలు జరగనున్నాయి.. ఈ ఎన్నికలు ఆప్, భారతీయ జనతా పార్టీ మరియు కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ఎన్నికల సమయంలో.. తమ అభ్యర్థి ఇలా తుపాకీతో హల్చల్‌ చేయడంతో ఆప్‌ శ్రేణులు ఒక్కసారిగా షాక్‌ తిన్నాయి.

Exit mobile version