ఎక్కడ ఏ డ్రెస్సు వేసుకోవాలో అక్కడ ఆ డ్రెస్సు వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది..కానీ జిమ్ కు వెళ్లేవాళ్ళు మాత్రం వర్కౌట్స్ చెయ్యడానికి సులువుగా ఉండే డ్రెస్సును వేసుకుంటే మంచిది.. కానీ చీరలో జిమ్ చెయ్యడం అంటే అది ఊహకు అందని విషయం అనే చెప్పాలి.. భారీ వర్కౌట్స్ చెయ్యాలి కదా ఎలా అనే సందేహం వస్తుంది కదూ.. ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూడండి..
విషయానికొస్తే.. ఫిట్‌నెస్ మీద ఆసక్తి ఉన్న మహిళ. చీర కట్టుకుని జిమ్‌లో వ్యాయామం చేయడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే చీరకట్టుతో ఏ పని చేయాలన్నా ఇబ్బంది పడిపోతాం అనే మహిళలకు భిన్నంగా రీనా సింగ్ చీరతో జిమ్ చేయడం నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. చీరలో ప్రత్యేకంగా కనబడుతూ రీనా జిమ్ చేస్తుంటే ఫిట్‌నెస్ పట్ల ఆమెకి ఉన్న అంకిత భావం కనిపిస్తోంది. ఫిటినెస్ పట్ల ఆసక్తి.. సంప్రదాయాన్ని గౌరవిస్తూ చీర ధరించడం రెండు సవాలుగా చెయ్యడం అందరిని ఆకట్టుకుంది..
సాంప్రదాయాలను గౌరవిస్తూ ఇలా చీరలో జిమ్ చెయ్యడం అనేది చాలా కష్టం.. కానీ ఈమె ఇష్టంగా చేసింది.. జింలో ఎంత సునాయసంగా వర్కౌట్ చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..వావ్.. అద్భుతంగా ఉంది అని ఒకరు పొగిడితే .. ‘సరైన జిమ్ దుస్తులు లేకుండా రీనా గాయపడే ప్రమాదం ఉందా?’ అని మరొకరు ప్రశ్నించారు. చీరతో ఆమె వర్కౌట్లు చేస్తుంటే ఆమె సాహసానికి అందారుణం ఫిదా అవుతున్నారు..నిజంగా ఆడవాళ్లు గ్రేట్ అనే చెప్పాలి..