ఈరోజుల్లో అబ్బాయిలు అమ్మాయిల కోసం వింత వింత యాడ్ లను ఇస్తుంటారు.. అలాగే సోషల్ మీడియాలో జనాలకు షాక్ ఇచ్చే రేంజులో పోస్టులను పెడుతున్నారు.. ఇంకొంతమంది ఒక ఉద్యోగం లాగా చెయ్యాలని యాడ్ లను ఇస్తున్నారు.. తాజాగా ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తనకు అమ్మాయిలు ఇలా కావాలని ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్లు వింత వింత పోస్ట్లు పెడుతూ జనాలను షాక్ ఇస్తున్నారు.. తాజాగా సాఫ్ట్ వేర్ జూనియర్ భార్య కావాలి అంటూ ఓ ప్రొఫెషనల్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశాడు. ఇలా ఎందుకు పోస్ట్ చేయాల్సి వచ్చిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…
అతను భార్య కోసం వెతుకుతూ లింక్డిన్ వెబ్ సైట్ లో పోస్ట్ చేశాడు. అతని కోరికల గురించి ఆ పోస్ట్ లో రాసుకొచ్చాడు.. అందులో ఏమి రాశాడంటే..నేను కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నా.. నా జీవితానికి జూనియర్ భార్య కోసం చూస్తున్నాను .. అనుభవజ్ఞులైన అభ్యర్థులు ఈ పోస్టుకు అర్హులు కారు.. ఎటువంటి అనుభవం లేని వారు మాత్రమే నాకు కావాలి.. కొన్ని ఇంటర్వ్యూల తర్వాత చివరగా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. అలాగే , వంటలో రెండేళ్ల అనుభవం ఉండాలని, రాత్రిపూట మేల్కొని నాకు నచ్చిన వాటిని చేసే పెట్టే సామర్థ్యం ఉండాలని పోస్టులో రాసాడు.. అది చూసిన అమ్మాయిలు షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు.. నెటిజన్లు రకరకాల కామెంట్స్ తో మరింత వైరల్ చేస్తున్నారు..