NTV Telugu Site icon

Viral Video: ఇనుప కడ్డీల మధ్య చిక్కుకుని విలవిలలాడుతున్న హంస.. వీడియో వైరల్

Swan

Swan

ప్రమాదవశాత్తు ఓ హంస ఇనుప కడ్డీలల్లో చిక్కుకుంది. దాని తల అందులో ఇరుక్కుపోయి.. ఎటు రాకుండా ఇబ్బందిపడుతుంది. అయితే అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి దాన్ని చూసి.. బయటకు తీసి రక్షించాడు. కాగా.. ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లకు భయం, ఆందోళన కలుగుతుంది. కాగా ఈ వీడియోను @JoshyBeSloshy అనే వినియోగదారు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో హంస కంచెలోని లోహపు కడ్డీల మధ్య నుంచి బయటకు రాలేకపోవడం చూడొచ్చు. ఇంకొద్ది సేపు అయితే ప్రాణాలు కూడా ప్రమాదం ఉన్నట్లుగా.. అలసిపోయి ఉంది. అయితే ఆ ఇనుప కంచె గట్టిగా ఉండటంతో హంస బయటకు రాలేకపోయింది.

Read Also: JP Nadda: బీజేపీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం పొడగింపు..

ఈ పోస్టుకు ఇప్పటికే 10 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 3.3 వేల రీట్వీట్ లు వచ్చాయి. జంతువులు పట్టణ ప్రాంతాల్లో తరచుగా ఇబ్బందులకు గురౌతున్నాయి. ఈ తరహా ఘటనల పట్ల జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా.. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇనుప కడ్డీల మధ్య హంస చిక్కుకుపోవడంతో అది శక్తి లేకుండా పోయిందని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ఇనుక కడ్డీల మధ్య హంస ఎలా ఇరుక్కుపోయిందని ఒక నెటిజన్ ప్రశ్నించారు.

Read Also: Viral Video: ప్లాస్టిక్ బాటిల్ ఎత్తుకెళ్తున్న పెద్దపులి.. వీడియో వైరల్

Show comments