Chhattisgarh: ఇద్దరు తల్లులతో ఒకే వేదికపై పెళ్లి.. కథలో ట్విస్టులే ట్విస్టులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఫ్కోర్స్.. ఆల్రెడీ పెళ్లయి, పిల్లలున్న వాళ్లు మళ్ళీ పెళ్లి చేసుకున్న సందర్భాల్ని మనం ఎన్నో చూశాం. కానీ, ఈ పెళ్లి మాత్రం అలా కాదు. ఇందులో మీకు ఊహించని ట్విస్టులు ఉంటాయి. ఒకే వేదికపై ఇద్దరు తల్లుల్ని ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. ఇంతకీ ఆ పిల్లల తండ్రి ఎవరనుకుంటున్నారు? ఆ వరుడే! ఇద్దరు యువతుల్ని ప్రేమించిన అతగాడు.. వారితో పిల్లల్ని కన్న తర్వాత ఒకే వేదికపై పెళ్లి చేసుకున్నాడు. ఈ అరుదైన సంఘటన ఛత్తీస్‌గఢ్, బస్తర్ జిల్లాలో జరిగింది.
కేశ్కాల్ ప్రాంతంలోని ఉమ్లా గ్రామానికి చెందిన రంజన్ సింగ్ సలామ్కి తొలుత ఆండేగా గ్రామానికి చెందిన దుర్గేశ్వరీ మార్కమ్ అనే యువతితో నిశ్చితార్థం అయింది. అప్పట్నుంచి ఆమె రంజన్ సింగ్ ఇంట్లోనే ఉంటూ వచ్చింది. కొన్ని నెలల తర్వాత ఆమె ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. కట్ చేస్తే.. దుర్గేశ్వరీ తన ఇంట్లో ఉండగానే అంవరీ గ్రామానికి చెందిన సన్నో బాయి అనే మరో యువతిని రంజన్ సింగ్ చాటుగా ప్రేమవ్యవహారం కొనసాగించాడు. ఈ క్రమంలోనే ఆమె కూడా గర్భం దాల్చింది. ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో, పెద్ద దుమారమే రేగింది. గ్రామంలో పంచాయతీ సైతం నిర్వహించారు. చివరికి.. ఆ ఇద్దరిని రంజన్ సింగ్ పెళ్లి చేసుకోవడమే సరైన పరిష్కారమని గ్రామ పెద్దలు నిర్ణయించారు.
Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
ఆ ఇద్దరు యువతుల్ని రంజన్ సింగ్‌ను వివాహమాడాల్సిందిగా ఒప్పించారు. తొలుత వాళ్లు ఒప్పుకోకపోయినా, అనంతరం అంగీకరించారు. పెద్దలు కూడా సరేనని చెప్పడంతో.. ఒకే వేదికపై ఈనెల 8న ఆ ఇద్దరిని రంజన్ సింగ్ వివాహం చేసుకున్నాడు. ఇలాంటి పెళ్లి తొలిసారి జరగడంతో.. ఈ వివాహ తంతును చూసేందుకు ఉమ్లా గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల గ్రామాలవారు సైతం తరలివచ్చారు.
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!