NTV Telugu Site icon

Viral News: ప్రియురాలిని ఇంప్రెస్ చేసేందుకు సింహం బోనులోకి ప్రేమికుడు.. చివరికీ..(వీడియో)

Lion

Lion

తన గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్ చేయడానికి ఓ వ్యక్తి చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాడు. తన ప్రియురాలిని ఎలాగైనా మెప్పించాలని సంకల్పించాడు. దీని కోసం సింహాల బోనులోకి ప్రవేశించాడు. కానీ సింహాలకు అది అస్సలు నచ్చలేదు. సింహాలు ఆ వ్యక్తిపై దాడి చేసి చంపాయి. ఆ వ్యక్తికి సంబంధించిన చివరి క్షణాల వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఉజ్బెకిస్థాన్‌ పార్కెంట్‌లోని ప్రైవేట్ జూలో ఈ ఘటన జరిగింది.

READ MORE: Chiranjeevi : ఒలింపిక్ విజేత దీప్తి జీవాంజికి రూ.3 లక్షల చెక్‌ అందించిన మెగాస్టార్

ఉజ్బెకిస్తాన్ లోని పార్కెంట్ జూలో పనిచేస్తున్న 44 ఏళ్ల ఎఫ్ ఇరిస్కులోవ్ తెల్లవారుజామున 5 గంటలకు సింహాల బోను దగ్గరకు వెళ్లాడు. తాళం తెరిచి లోపలికి వెళ్లాడు. అక్కడ ప్రశాంతంగా కూర్చున్న సింహాల వద్దకు చేరుకున్నాడు. వీడియో ప్రారంభంలో సింహం చాలా ప్రశాంతంగా కనిపించాయి. అతడిని పట్టించుకోలేదు. కానీ.. ఆ వ్యక్తి అంతటితో ఆగకుండా సింహాన్ని తాకుతూ.. లాలించడం ప్రారంభించాడు. అప్పుడు ఒక సింహం వచ్చి అతనిపై దాడికి యత్నించింది.

READ MORE: Pawan Kalyan: జనసేన ఆవిర్భావ దినోత్సవం.. 3 రోజుల పాటు పిఠాపురంలో ప్లీనరీ..

ఇరిస్కులోవ్ సింహాన్ని “సింబా” అని అరుస్తూ శాంతించమని చెబుతాడు. దీంతో అది వెనక్కి తగ్గుతుంది. అయితే మరో సింహం అతనిపై దాడి చేసింది. అతను బిగ్గరగా అరిచినప్పటికీ అది వినలేదు. ఈ దాడిలో ఇరిస్కులోవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మొత్తం సంఘటనను తానే స్వయంగా వీడియో తీశాడు. ఈ భయానక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాడి అనంతరం ఈ సింహాలు జూలో ఆవరణలో సంచరించాయని పోలీసులు తెలిపారు.

Show comments