OnePlus-11(5G) to launch in India: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ‘వన్ ప్లస్’.. సరికొత్త మోడల్ సెల్‌ఫోన్‌ను స్వదేశంలో జనవరి 4వ తేదీన.. అంటే.. బుధవారం నాడు లాంఛ్ చేయబోతోంది. ఇండియాలో మాత్రం నెల రోజులు ఆలస్యంగా అందుబాటులోకి తీసుకురానుంది. లేటెస్ట్ లెవెన్ సిరీస్‌లో 5జీ టెక్నాలజీతో రూపొందించిన ఈ అప్‌డేటెడ్ మొబైల్ ఫోన్‌ను ఫిబ్రవరి 7వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహించనున్న క్లౌడ్-11 ఈవెంట్‌లో ఆవిష్కరించనుంది.
రోజు రోజుకు టెక్నాలజీ పెరిగిపోతోంది. కొత్త కొత్త స్మార్టఫోన్ కంపెనీలు రంగంలోకి దిగి వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇప్పటికే విదేశీ కంపెనీ మొబైల్స్ అమ్మకాల్లో భారత్‌లో ఓ ఊపు ఊపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరొ కొత్త స్మార్ట్‌ఫోన్ కంపెనీ భారత విపణిలోకి అడుగుపెట్టబోతోంది. లండన్‌కు చెందిన ‘నథింగ్’ కంపెనీ తన తొలి మొబైల్‌ను ఇండియా మార్కెట్లో లాంచ్ చేయనుంది. వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పై నేతృత్వంలోని నథింగ్ లండన్‌లో వర్చువల్ ఈవెంట్ ద్వారా…