India's First C-295 Aircraft: రక్షణ శాఖ కోసం ప్రత్యేకంగా తయారుచేయిస్తున్న అత్యాధునిక విమానం C-295. ఇటీవల విడుదలైన ఈ ఎయిర్‌క్రాఫ్ట్ వీడియోలు, ఇమేజ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ అధునాతన విమానాన్ని టాటా మరియు ఎయిర్‌బస్ సంస్థ కలిసి రూపొందిస్తున్నాయి. వాయుసేనకు అందించనున్న 16 మధ్య తరహా విమానాల్లో ఇది మొదటిది. మొత్తం.. 56.. C-295 విమానాల సేకరణకు కేంద్ర ప్రభుత్వం 2021 సెప్టెంబర్‌లో ఆమోదం తెలిపింది.