NTV Telugu Site icon

ChatGPT: మార్కెట్‌లోకి కొత్త యాంకర్‌. ఈమెనెప్పుడైనా చూశారా?

ChatGPT

ChatGPT

ChatGPT: ప్రపంచ మీడియా చరిత్రలో ఇంతకుముందెన్నడూ.. ఎవరూ.. చూడని ఒక కొత్త యాంకర్‌ తాజాగా తెర మీదికొచ్చారు. ఆమె పేరు.. చాట్‌జీపీటీ. అదేంటి?.. చాట్‌జీపీటీ అంటే ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌తో పనిచేసే చాట్‌బాట్‌ కదా అనుకుంటున్నారా?. అది నిజమే. ఆ కృత్రిమ మేధతో రూపొందించిన పరికరమే ఇప్పుడు యాంకర్‌గా సరికొత్త అవతారమెత్తింది.

అంతర్జాతీయ ప్రముఖులిద్దరిని అలవోకగా ఇంటర్వ్యూ చేసేసింది. అందులో ఒకరు.. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ కాగా ఇంకొకరు మైక్రోసాఫ్ట్‌ కోఫౌండర్‌ బిల్‌గేట్స్‌. ఈ ఇద్దరిని చాట్‌జీపీటీ.. ఆసక్తికరమైన.. కాస్త కష్టమైన ప్రశ్నలే అడిగింది. వాటికి.. వాళ్లు కూడా.. అంతే ఆకట్టుకునేలా సమాధానాలు చెప్పారు. ఈ విషయాన్ని బిల్‌గేట్స్‌.. లింక్డిన్‌ ద్వారా వెల్లడించారు.

read more: Startups Fundraising: 8 నెలల కనిష్టానికి ఫండ్‌ రైజింగ్‌

గ్లోబల్‌ ఎకానమీ పైన, జాబ్‌ మార్కెట్‌ మీద టెక్నాలజీ ప్రభావం ఎలా ఉంటుందన్న ప్రశ్నకు బిల్‌గేట్స్‌ బదులిస్తూ.. హెల్త్‌కేర్‌, ఎడ్యుకేషన్‌ సెక్టార్లలో నిపుణుల కొరతను ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ తీరుస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. యవ్వనంలోకి వెళ్లగలిగితే మీ కెరీర్‌ కోసం మీకు మీరు ఎలాంటి సలహాలు ఇచ్చుకుంటారన్న ప్రశ్నకు బిల్‌గేట్స్‌ సరదాగా జవాబిచ్చారు.

భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించకుండా వర్తమానంలో బతికేందుకు ప్రయత్నిస్తానన్నారు. యవ్వనంలో బాగా కష్టపడ్డానని, ఇప్పుడు ఆలోచిస్తుంటే అంతలా శ్రమించి ఉండకూడదనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. రిషి సునాక్‌ కూడా ఇదే ఒపీనియన్‌ని వ్యక్తం చేశారు. మీకు సంబంధించిన ఏ పనులను ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ చేస్తే బాగుంటుందని మీరనుకుంటున్నారన్న ప్రశ్నకు ఇద్దరూ వేర్వేరు ఆన్సర్లు ఇచ్చారు.

తన నోట్స్‌ని కృత్రిమ మేధ అయితే తనకన్నా తెలివిగా రాయగలదని బిల్‌గేట్స్‌ అన్నారు. ప్రతివారం ప్రధానమంత్రి ఎదుర్కొనే ప్రశ్నల సమయాన్ని తనకు బదులుగా ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ చూసుకుంటే బాగుంటుందని రిషి సునాక్‌ పేర్కొన్నారు.