చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి. తెలంగాణ కు మహారాష్ట్ర నుంచి ఎక్కువ వ్యాప్తి ఉంది అని DH.శ్రీనివాస్ తెలిపారు. 24 మార్చి మొదటి వారంలోబార్డర్ జిల్లాకు మహారాష్ట్ర నుంచి 20 మంది వచ్చారు. ఓ ఫెస్టివల్ కు హాజరయ్యారు. ఈ ఘటనలో 430 మందికి వైరస్ సోకింది. గాలిద్వారా కరోనా వ్యాప్తి జరుగుతోంది. తెలంగాణ లో ప్రతి రోజు లక్ష మందికి పైగా టెస్టులు చేస్తున్నాం.15 రోజుల్లో పాజిటివ్ రేటు రెట్టింపు అయింది. రెండురోజులుగా బెడ్స్ సమస్య తలెత్తుతుంది. మొదట్లో 40 శాతం బెడ్ అక్కుపెన్సి ఉంది. ఇపుడు 116 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్మెంట్ అందిస్తున్నాం.1935 ప్రయివేట్ ఆస్పత్రులకు కరోనా ట్రీట్మెంట్ కు అనుమతి ఉంది. వంద మందికి కరోనా వస్తే 80 శాతం మందికి ఎటువంటి లక్షణాలు లేవు. 7 నుంచి 8 శాతం ఆస్పత్రిలో చేరుతున్నారు. కరోనా పాజిటివ్ అనగానే అందరూ ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఉండదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్, మందుల కొరత లేదు. కాబట్టి ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకే రండి అని ఆయన పేర్కొన్నారు.