Taiwan-China: తైవాన్ రక్షణ అధికారి అనుమానాస్పద మృతి.. కారణమదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taiwan-China: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటనతో తైవాన్-చైనాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. పెలోసీ పర్యటనకు ప్రతీకారంగా తైవాన్ చుట్టూ చైనా చేపట్టిన భారీ సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తైవాన్ రక్షణ రంగానికి చెందిన ఓ కీలక అధికారి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. తైవాన్ రక్షణ శాఖ పరిధిలోని పరిశోధన అభివృద్ధి విభాగం డిప్యూటీ హెడ్‌గా పనిచేసే యాంగ్ లీషింగ్ ఓ హోటల్ రూమ్‌లో మరణించినట్టు గుర్తించారు. దక్షిణ తైవాన్‌లోని పింగ్ టంగ్ పర్యటనలో ఇది చోటు చేసుకుంది. యాంగ్ లీషింగ్ ఈ ఏడాది ఆరంభంలోనే చంగ్ షాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వైస్ ప్రెసిడెంట్ పదవిని చేపట్టడం గమనార్హం. పలు క్షిపణుల తయారీ కార్యకలాపాలను ఆయన పర్యవేక్షిస్తుంటారు. ఆయన మృతికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. మయోకార్డియల్ ఇన్ ఫ్రాక్షన్, యాంజీనా పెక్టోరిస్ వల్ల మరణించినట్టు ఫోరెన్సిక్ పరీక్షలో వెల్లడైనట్టు అతను పనిచేసిన ఆర్మీ యాజమాన్యంలోని ఇన్‌స్టిట్యూట్ తెలిపింది
Common Wealth Games 2022: కామన్‌వెల్త్‌లో భారత్.. నేటి షెడ్యూల్
Also Read
- Worst Street Food: వరస్ట్ స్ట్రీట్ ఫుడ్‌లలో మన బోండా.. ఏ ప్లేస్ లో ఉందో తెలుసా?
- house collapses due to blast: భారీ పేలుడు.. ఇల్లు కూలి ఆరుగురు మృతి
- Agnipath: నిర్ణయం తీసుకునే ముందు మా వాదన వినండి.. సుప్రీంలో కేంద్రం కేవియట్ దాఖలు
- Police to Arrest TDP Ayyanna Patrudu Live : అయ్యన్న అరెస్ట్ కు రంగం సిద్ధం..
అయితే, యాంగ్ లీషింగ్ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పెలోసీ తైవాన్ లో పర్యటించి వెళ్లిన వెంటనే చైనా ప్రతీకార చర్యలకు దిగడం తెలిసిందే. తైవాన్ చుట్టూ యుద్ధ విన్యాసాలు చేస్తోంది. ఈ తరుణంలో యాంగ్ లీషింగ్ మరణించడమే అనుమానాలకు తావిస్తోంది. చైనా సైనిక విన్యాసాలపై తైవాన్ తీవ్రంగా స్పందించింది. తమ ప్రధాన భూభాగంపై దాడికి చైనా సన్నాహాలు చేస్తోందని ఆరోపించింది. తైవాన్ జలసంధిలో చైనాకు చెందిన యుద్ధ విమానాలు, నౌకలు భారీ సంఖ్యలో మోహరించి సైనిక విన్యాసాలు చేస్తున్నాయని, కొన్ని చోట్ల నియంత్రణ రేఖను దాటి ఈ నౌకలు తమ జలాల్లో ప్రవేశించాయని తైవాన్ రక్షణశాఖ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇవన్నీ చూస్తుంటే డ్రాగన్ తమ భూభాగంపై దాడి చేయడం కోసమే ఈ సన్నాహాలు చేస్తున్నట్లు అర్థమవుతోందని పేర్కొంది. విన్యాసాల్లో భాగంగా చైనా క్షిపణులు కొన్ని తైవాన్ మీదుగా ప్రయాణించినట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అదే నిజమైతే తైవాన్ సౌర్వభౌమత్వాన్ని డ్రాగన్ ఉల్లంఘించినట్లే అవుతుంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..