ఈరోజు ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇక ఇందులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ హైదరాబాద్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే రాయల్స్ జట్టులో ఓపెనర్ యషస్వి జైస్వాల్(12) త్వరగా పెవిలియన్ చేరుకున్న తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సంజు సామ్సన్ తో కలిసి జోస్ బట్లర్ రెండో వికెట్ కు 150 పరుగుల భాగసౌమ్యని నెలకొల్పాడు. ఈ క్రమంలో సంజు(48) ఔట్ అయిన బట్లర్ తన బాదుడు కొనసాగిస్తూ సెంచరీ పూర్తి చేసుకొని 124 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 19వ ఓవర్ చివరి బంతికి వెనుదిరిగాడు. అప్పటికే 209 పరుగులు చేసిన రాజస్థాన్ చివరి ఓవర్ లో మరో 11 పరుగులు చేసి 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు సాధించింది. ఇక సన్‌రైజర్స్ బౌలర్లలో విజయ్ శంకర్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవాలంటే హైదరాబాద్ 221 పరుగులు చేయాలి. కానీ సన్‌రైజర్స్ ఎప్పుడు ఛేదనలో చిన్న లక్షలకే తడబడుతుంది. మరి ఈ భారీ లక్ష్య ఛేదనలో ఏం చేస్తుంది అనేది చూడాలి.