చెన్నై వేదికగా ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ మధ్య ప్రస్తుతం మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇందులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కు సన్‌రైజర్స్ బౌలర్లు చుక్కలు చూపించారు. వరుస వికెట్లు తీస్తూ బాట్స్మెన్స్ ను క్రీజులో కుదురుకోకుండా చేసారు. అయితే పంజాబ్ తరపున ఈ ఇన్నింగ్స్ లో అత్యధికంగా మయాంక్ అగర్వాల్,షారుఖ్ ఖాన్ ఇద్దరు 22 పరుగులు చేసారు. దాంతో ఆ జట్టు నిర్ణిత 19.4 ఓవర్లలో 120 పరుగులకు కుప్పకూలిపోయింది. ఇక హైదరాబాద్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా అభిషేక్ శర్మ రెండు, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్దార్థ్ కౌల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే హైదరాబాద్ 121 పరుగులు చేయాలి. చుడాలిమరి ఏం జరుగుతుంది అనేది.