ఐపీఎల్ లో ఈరోజు జరిగిన మొదటి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కత నైట్ రైడర్స్ తలపడ్డాయి. అయితే ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బెంగళూరుకు మొదట్లో కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి షాక్ ఇచ్చిన ఆ తర్వాత మాక్స్వెల్, డివిలియర్స్ అర్ధశతకాలు చేయడంతో బెంగళూరు నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఇక 205 పరుగుల భారీ లక్థ్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ కు శుభారంభమే దక్కింది. కానీ ఆ తర్వాత బెంగళూరు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి కేకేఆర్ బ్యాట్స్మెన్స్ ను కట్టడి చేసారు, వచ్చిన వారిని ఎవరిని క్రీజులో కుదురుకోనివ్వలేదు. కానీ చివర్లో రస్సెల్ తన హిట్టింగ్ తో కోల్‌కత కు ఆశ పుట్టించిన అది నిరాశగానే మిగిలింది. ఆఖర్లో బెంగళూరు బౌలర్లు వరుస వికెట్లు తీయడంతో కేకేఆర్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 166 పరుగులు మాత్రమే చేసింది. దాంతో కోహ్లీసేన 38 పరుగుల తేడాతో ఈ ఐపీఎల్ లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది.