వైద్య ఆరోగ్యశాఖను మంత్రి ఈటల రాజేందర్ నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు గవర్నర్ తమిళిసై. అయితే తనను బాధ్యతల నుండి తప్పించడం పై స్పందించిన ఈటల… వేలాది కేసులు వస్తున్న తరుణంలో ప్రజలకు మెరుగైన చికిత్స అందేలా వైద్య ఆరోగ్య శాఖను సీఎం నా.నుంచి తీసుకున్నారు. ఏ శాఖని అయిన తీసుకునే అధికారిని తప్పించే అధికారం సీఎం కి ఉంది అని తెలిపారు. శాఖ లేకున్నా వ్యక్తిగతంగా ప్రజలకి సేవ చేస్తా.. తన పై ప్రణాళిక బద్ధమైన కుట్ర జరుగుతుంది. వంద ఎకరాలు ఆక్రమించి షేడ్లు వేశారని అంటున్నారు.. అర ఏకరమా వంద ఎకరాల తెలాలి. విచారణ గురించి తెలియదు.. కరోన కేసులు పైనే దృష్టి పెట్టాను.. ఈ రోజు కార్యకర్తలు నేతలతో మాట్లాడుతూ ఉన్న రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారు. నేను సీఎం తో మాట్లాడేందుకు ప్రయత్నించలేదు ప్రయత్నించను అని తెలిపారు.