ఈరోజు జరుగుతున్న రెండో మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ కు వచ్చిన కోల్‌కత నైట్ రైడర్స్ ను బాగానే కట్టడి చేసింది. మొదట బ్యాటింగ్ కు వచ్చిన కేకేఆర్ ఓపెనర్లలో నితీష్ రానా(15) పరుగులు చేసి వెనుదిరిగిన తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి(19) కూడా తర్వాతగా ఔట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సునీల్ నరైన్, మోర్గాన్ ఇద్దరు డక్ ఔట్స్ గా పెవిలియన్ చేరుకున్నారు. కానీ ఓపెనర్ (43) తో రాణించగా చివర్లో ఆండ్రీ రస్సెల్(45) తో రెచ్చిపోయాడు. నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది నైట్ రైడర్స్. ఇక ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ రెండు వికెట్లు తీయగా మార్కస్ స్టోయినిస్, అవేష్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవాలంటే ఢిల్లీ 155 పరుగులు చేయాలి. అయితే ప్రస్తుతం ఈ ఐపీఎల్ సీజన్ లలో కేకేఆర్ ఆడిన మ్యాచ్ లను బట్టి చూస్తే ఆ జట్టు బౌలర్లకు ఈ లక్ష్యాన్ని కాపాడటం కష్టమనే చెప్పాలి.