అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించారు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్. అనంతరం ఆయన మాట్లాడుతూ… సైబరాబాద్ పోలీసులు మరియు SCSC కలిసి సంవత్సరం నుండి చాలా కార్యక్రమాలు చేపట్టాడం జరిగింది. మెడికల్ ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్ లు ప్రారంభిండం జరిగింది. అంబులెన్స్ లు దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి పలు ఐటీ కంపెనీలు సహకారంతో 12 అంబులెన్స్ లను అందుబాటులోకీ తెచ్చాం. నగరం మొత్తం ఈ 12 అంబులెన్స్ లు నడుస్తాయి. అంబులెన్స్ ల కోసం ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం. ఎస్సై ర్యాంక్ అధికారి ఈ కంట్రోల్ రూం ఆపరేట్ చేస్తాడు. అంబులెన్స్ ల ఏర్పాటు కు ముందుకు వచ్చిన ఐటీ కంపెనీల ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తు ప్రజలను మోసం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది.. వారి పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న ప్రతిఒక్కరు ఈ ఫ్రీ అంబులెన్స్ సర్వీసులను ఉపయోగించుకోవాలి అని తెలిపారు. అయితే ఈ కార్యక్రమంలో SCSC సెక్రటరీ కృష్ణ ఏదుల, డీసీపీ లు పాల్గొన్నారు.