ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం లోకి వచ్చిన దగ్గరి నుండి ప్రజా సంఘాలను అనగదొక్కుతున్నాడు. పోలీసులు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల పై అక్రమ కేసులు పెడుతున్నారు అని పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నిషేధించడం దారుణం.. ప్రజా సమస్యల పై అనేక దఫాలుగా పోరాడుతున్న సంస్థలను మావోలతో ముడి పెట్టి నిషేధించడం సరైన పద్ధతి కాదు. గత 50 సంవత్సరాలుగా పనిచేస్తున్న సంఘాలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎక్కడ చేసామో ప్రభుత్వం చూపించాలి. ప్రజాస్వామ్య బద్దంగా, రాజ్యాంగం బద్ధంగా సభలు సమావేశాలు పెట్టి ప్రజా సమస్యల కోసం పొరుడుతున్నాం. ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న సంఘాలను నిషేధించడం దారుణం అని అన్నారు. విప్లవ రచయితల సంఘం నేతలు వరవరరావు, సాయి బాబా లను అరెస్ట్ చేస్తే బెయిల్ ఇవ్వాలని కోరడం తప్పా అని అడిగిన ఆయన చట్ట ప్రకారం బెయిల్ ఇవ్వాలని కోరితే చట్ట వ్యతిరేక చర్య ఏ విదంగా అవుతుందో చెప్పాలి అన్నారు. మావోయిస్టుల ఏ జెండా ను మేము ఎందుకు అమలు చేస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ మావోయిస్టుల ఏ జెండా అమలు చేస్తామని చెప్పాడు. 16 సంఘాలు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఎప్పుడు మావోయిస్టుల ఏ జెండాలను అమలు చేయలేదు. చట్ట వ్యతిరేక సంఘాలు గా ప్రభుత్వం చిత్రీకరిస్తే ప్రజల్లో కి ఎలా వెళ్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడు మా సంఘాలు ప్రవర్తించలేదు. చట్టాలకు అనుగుణంగా పరిపాలన చెయ్యాలని చెప్పడం తప్పా. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. ప్రభుత్వం నిషేధిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 73 ని వెంటనే వెనక్కి తీసుకోవాలి అని పేర్కొన్నారు.