ఈరోజు ఐపీఎల్ 2021 లో పంజాబ్ కింగ్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై విజయం సాధించింది. 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన చెన్నై చేధనను నెమ్మదిగా ఆరంభించింది. ఈ క్రమంలోనే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఔట్ అయిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మొయిన్ అలీ స్పీడ్ పెంచాడు. క్రమంగా బంతులను బౌండరీలు దాటిస్తూ జట్టును లక్ష్యానికి దగ్గర చేసి 47 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ చేరుకున్నాడు. ఇక ఆ తర్వాత విజయానికి 8 పరుగులే అవసరం అనే సమయంలో రైనా, రాయుడు వరుస బంతుల్లో వెనుదిరిగిన ఓపెనర్ డు ప్లెసిస్ చివరి వరకు నాట్ ఔట్ గా నిలిచి జట్టుకు 15.4 ఓవర్లలోనే విజయాన్ని అందించాడు. దీంతో ఈ ఐపీఎల్ సీజన్ లో మొదటి విజయాన్ని నమోదుచేసింది చెన్నై.
ఇక అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ ను పేసర్ దీపక్ చాహర్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ముఖ్యమైన నలుగురు ఆటగాళ్లను వరుసగా పెవిలియన్ కు చేర్చాడు. కానీ పంజాబ్ జట్టు యువ ఆటగాడు షారుఖ్ ఖాన్ చేసిన 47 పరుగుల కారణంగా ఆ జట్టు 100 పరుగులను దాటింది. దాంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.