Bigg Boss Telugu OTT : నాన్ స్టాప్ ఎంటర్టైనెంట్… లోగో అవుట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలే సందర్భంగా టీవీ షో OTT వెర్షన్ రెండు నెలల్లో ప్రత్యక్ష ప్రసారం కానుందని నాగార్జున చెప్పిన విషయం తెలిసిందే. ఆయన చెప్పినట్టుగానే టీవీ షో కొత్త ఎడిషన్ గ్రాండ్ ప్రీమియర్ కోసం సిద్ధమవుతోంది. బిగ్ బాస్ తెలుగు పాపులర్ టెలివిజన్ ఎంటర్‌టైన్‌మెంట్ షోలలో ఒకటి. ఇప్పుడు షో OTT ప్రపంచంలోకి వస్తోంది. బిగ్ బాస్ తెలుగు OTT వెర్షన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుందని చాలా రోజులుగా వినిపిస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. డిస్నీ+ హాట్‌స్టార్ బిగ్ బాస్ ఆన్‌లైన్ వెర్షన్ స్ట్రీమింగ్ లోగోను షేర్ చేయడంతో పాటు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన అప్‌డేట్‌ను విడుదల చేసింది.
Read Also : Khiladi : హీరోయిన్ కు సారీ చెప్పిన డైరెక్టర్… ఏం జరిగిందంటే ?
Also Read
“2022 అతిపెద్ద సర్ప్రైజ్ చివరకు ఇక్కడ ఉంది. #BiggBossNonStop 24/7 వినోదాన్ని అందిస్తుంది! బిగ్ బాస్ హౌస్ నుండి నేరుగా @DisneyPlusHSలో మాత్రమే. ఈ వినోద అద్భుతం అతి త్వరలో మీ చేతుల్లోకి రానుంది. తెలుగు ప్రేక్షకులను సరికొత్త స్థాయిలో అలరిస్తుంది!” అంటూ Disney+ Hotstar హ్యాండిల్ నుండి లోగోను షేర్ చేసింది. ఈ OTT షో కోసం ఇప్పటికే పోటీదారులు ఎంపికయ్యారు. బిగ్ బాస్ ఓటిటి వెర్షన్ ఫిబ్రవరి 26 నుండి ప్రసారం కానుందని గాసిప్ విన్పిస్తోంది. టీవీ షోకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
The Biggest Surprise of 2022 IS FINALLY HERE.#BiggBossNonStop promising 24/7 entertainment! DIRECT from the Bigg Boss house, only on @DisneyPlusHS This entertainment marvel will be reaching your hands very soon.@BiggBoss @DisneyPlusHSTel #BiggBoss pic.twitter.com/vH9fNrbgRN
— JioHotstar Telugu (@JioHotstarTel_) February 9, 2022
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!