నిన్న తిరుపతిలో జరిగిన పోలింగ్ వ్యవహారం చూస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్టే లెక్క… వేలకొలదీ దొంగ ఓటర్లను తీసుకొచ్చి సిగ్గులేకుండా ఓట్లు వేయించుకోవడం దారుణం అని టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. దొంగలకు, కేటుగాళ్లు కు, సన్నాసులు కి అధికారమిస్తే పరిపాలన అలాగే ఉంటుంది రాజ్యాంగానికి విరుద్ధంగా దౌర్జన్యంగా, దొంగ ఓట్లు వేసుకుంటే ఎన్నికల ప్రక్రియ వృదా అని తెలిపారు. అవసరమైన ఎంపీలు, ఎమ్మెల్యేలుని మీరే నామినేట్ చేసుకుంటే బాగుంటుంది. డిజిపి నాయకత్వంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం కావడం దారుణం. దొంగలను పట్టుకున్న పోలీసులు, వారికే బానిసలుగా పనిచేస్తున్నారు. పిచ్చి నా కొడుకు పరిపాలనలో పిచ్చెక్కి మాట్లాడుతుంటే డీజీపీ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు అని చెప్పిన ఆయన తిరుపతి దొంగ ఓట్లు వేయడంపై నైతికంగా రాజీనామా చేసి, మీరు వెళ్ళిపోతే బాగుంటుంది అన్నారు. ఈ వ్యవహారంపై గవర్నర్, రాష్ట్రపతి చొరవ తీసుకోవాలి. అధిక దొంగ ఓట్లు పోలైన తిరుపతి నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించాలి అని పేర్కొన్నారు.