Antarctica: మంచు మధ్య ప్రవహిస్తున్న రక్తపు జలపాతం? అసలేంటి ఈ మిస్టరీ?

  • అంటార్కిటికాలో అనేక మిస్టరీలు
  • మంచు ప్రవాహంలో రక్తపు జలపాతం
Antarctica

Antarctica

గత 500 సంవత్సరాలలో మానవులు భూమిపై ఉన్న ప్రతి ఖండంలోనూ తమదైన ముద్ర వేశారు. కానీ అంటార్కిటికా ఇప్పటికీ మానవులకు మిస్టరీగా మిగిలిపోయింది. దీనికి కారణం అక్కడ అనేక మీటర్ల పాటు మందపాటి మంచు ఉండటం. నేటికీ.. అంటార్కిటికా అనేది భూమిపై అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో ఒకటిగా మారింది. ఈ ఖండంలో అనేక రహస్యాలు వెల్లడయ్యాయి. ఈ రహస్యాలు కనుగొనేటప్పుడు శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపోయారు. అలాంటి ఒక రహస్యం ఇక్కడ ప్రవహించే జలపాతం. దీనిని రక్త జలపాతం అని పిలుస్తారు.

READ MORE: U-19 World Cup 2025: ఇంగ్లాండ్‌పై గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత మహిళల జట్టు..

అంటార్కిటికాలోని టేలర్ గ్లేసియర్ దిగువ నుంచి వెస్ట్ లేక్ బోనీలోకి ప్రవహించే ఈ జలపాతం ఎరుపు రంగులో ఉంటుంది. థామస్ గ్రిఫిత్ టేలర్ అనే ఆస్ట్రేలియన్ జియాలజిస్ట్ అంటార్కిటికా పర్యటనలో దీనిని కనుగొన్నారు. సుమారు 110 సంవత్సరాల క్రితం ఈ జలపాతాన్ని కనుగొన్నారు. 1911లో టేలర్, అతని బృందం రక్తం లాంటి ద్రవం ప్రవాహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎర్ర శైవల సమృద్ధి కారణంగా ఇక్కడ మంచు రంగు ఎర్రగా మారిందని మొదట్లో భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు విశ్వసించారు. కానీ 2003లో దశాబ్దం తర్వాత దాని నిజం బయటపడింది. 2003లో ఒక బృందం దాని ఎరుపు రంగును పరిశోధించింది. జలపాతంలో ఐరన్ ఆక్సైడ్ చాలా ఎక్కువగా ఉన్నట్లు విచారణలో తేలింది.

READ MORE: Economic Survey: భారతదేశ జీడీపీ అంచనా 6.3% – 6.8%.. ఎకనామిక్ సర్వేలో కీలక విషయాలు..

హిమానీనదం క్రింద ఉన్న ఉప్పునీరు గాలిని తాకినప్పుడు అది అకర్బన సమ్మేళనాలను ఏర్పరుస్తుంది. ఇక్కడ కొన్ని సూక్ష్మజీవులు ఉన్నాయని గుర్తించారు. దీని కారణంగా ఇక్కడ ఉప్పు స్థాయి సముద్రపు ఉప్పు కంటే చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపారు. హిమానీనదం క్రింద ఇనుము అధికంగా ఉండటంతో నీరు మంచు ద్వారా పైకి పోతుంది. పైన ఉన్న ఉప్పు, గాలితో కలిసి అది ఆక్సిజన్‌తో చర్య జరుపుతుంది. దీని కారణంగా రంగు ఎరుపుగా మారుతుంది. ఇక్కడ ఉన్న జంతువులు శతాబ్దాలుగా మంచులో నివసించడం వల్ల వాతావరణానికి అనుగుణంగా మారాయి.