బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఈ మధ్య భారత్ – పాక్ మ్యాచ్ ను చూడటానికి స్టేడియంకు వెళ్లింది.. అక్కడే తన విలువైన ఐఫోన్ ను పోగొట్టుకుంది.. గత కొన్ని రోజులుగా తన ఫోన్ కోసం తెగ వెతుకుతుంది.. అంతేకాదు ఇటీల తన ఫోన్ ను తిరిగి ఇచ్చేసిన వారికి అదిరిపోయే గిఫ్ట్ ను కూడా ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇదిలా ఉండగా తాజాగా ఓ వ్యక్తి అమ్మడుకు ఈ మెయిల్ చేశాడు.. ‘నీ ఫోన్ నా దగ్గర ఉంది. నీకు అది కావాలంటే నా సోదరుడు క్యాన్సర్ నుంచి కోలుకోవడానికి నువ్వు నాకు సాయం చేయాలి’ అని ఈ-మెయిల్‌లో ఆ వ్యక్తి పేర్కొన్నాడు..
ఈ విషయాన్ని చెబుతూ ఊర్వశి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.. ఆ వ్యక్తి చేసిన ఈ-మెయిల్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ ను కూడా ఆమె అందులో చూపింది.. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. తన 24 క్యారెట్స్ రియల్ గోల్డ్ ఐ ఫోన్ ను పోగొట్టుకున్న విషయం తెలిసిందే. గుజరాత్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇటీవల భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ముగిశాక ఊర్వశి రౌతేలా ఓ ట్వీట్ చేసింది. తాను మ్యాచ్ చూడడానికి వెళ్లానని, ఆ సమయంలో తన ఐ ఫోన్ పోయిందని చెప్పింది. ఫోన్ తిరిగి తన వచ్చేలా సాయం చేయండని ఫ్యాన్స్ ను కోరింది..
ఈ మేరకు అమ్మడుకు ఒక మెయిల్ శుభవార్తను చెప్పింది.. ఓ వ్యక్తి నుంచి ఈ-మెయిల్ వచ్చింది. ఆమె పోగొట్టుకున్న ఫోను ఆమె వద్దకు వస్తుందో లేదో కానీ ఇటువంటి మెసేజ్ లు మాత్రం ఆమెకు ఫుల్లుగా వస్తున్నాయి.. మొత్తానికి ఈ ఫోన్ వ్యవహారం ఇప్పటిలో తేలేలా కనిపించడం లేదు.. ఇకపోతే సినిమాల విషయానికోస్తే.. ఈ అమ్మడు ఫుల్ బిజీగా ఉందని తెలుస్తుంది.. సౌత్ లో వరుస ఐటమ్ సాంగ్స్ చేస్తూ క్రేజ్ ను పెంచుకోవడంతో రెండు చేతులా సంపాదిస్తుంది..