ముందే ఈడీ కార్యాలయానికి చేరుకున్న రకుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్ కేసులో ఈడీ పలువురు ప్రముఖులకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఛార్మి, పూరి జగన్నాథ్ ల విచారణ పూర్తయ్యింది. ఈరోజు రకుల్ ప్రీత్ సింగ్ వంతు వచ్చింది. రకుల్ ఇప్పుడే ఈడి కార్యాలయానికి చేరుకుంది. అయితే ఈడి అధికారుల కంటే ముందే ఆమె ఈడి కార్యాలయానికి చేరుకోవడం గమనార్హం. ఈరోజు ఉదయం 10:30కి ఈడి కార్యాలయానికి రావాల్సిందిగా రకుల్ కు నోటీసులు అందాయి. కానీ రకుల్ మాత్రం ఉదయం 9:10కి ఈడి కార్యాలయానికి చేరుకుంది. రకుల్ తో పాటు ఒక న్యాయవాది, రకుల్ మేనేజర్, రకుల్ సిఎ కూడా వచ్చారు. ఆరెంజ్ కలర్ ఫైల్ చేత్తో పట్టుకుని ఈడి ఆఫీస్ కు చేరుకుంది రకుల్. తనకు చెందిన పలు బ్యాంక్ ఖాతాల స్టేట్మెంట్ లను విచారణ కోసం తీసుకొచ్చింది. డ్రగ్స్ కేసు లో రకుల్ విచారణ పప్రారంభమైంది. 2016లో నవదీప్ ఎఫ్ క్లబ్ లో పార్టీకి రకుల్, రానా దగ్గుబాటి అటెండ్ అయ్యారు. అదే పార్టీ లో చాలా మందికి కెల్విన్ డ్రగ్స్ సప్లై చేశాడు. పార్టి ఫుటేజ్ ఆధారంగా రకుల్ కి ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణ ఎంతసేపు జరుగుతుంది ? అనేది ఆసక్తికరంగా మారింది.
Read Also : మణిరత్నంపై కేసు నమోదు
Also Read
- Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
- 1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
- Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
- Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ ని సెప్టెంబర్ 6న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. అనివార్య కారణాల వల్ల విచారణకు హాజరు కాలేనంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీకి లేఖ రాసింది. మరో డేట్ ఇవ్వాలని అధికారులకు విన్నవించుకున్నారు. రకుల్ రిక్వెస్ట్ ని ఈడీ అధికారులు రిజెక్ట్ చేశారు. ఇవాళే విచారణకు హాజరు కావాలని తేల్చి చెప్పారు.
సుమారు 10 గంటల పాటు ఛార్మిని ఈడీ అధికారులు విచారించారు. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనతో పాటు.. కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఛార్మిపై ప్రశ్నల వర్షం కురిపించారు ఈడీ అధికారులు. ఛార్మి మొబైల్‌లో కెల్విన్ చాటింగ్ వివరాలపై కూపీ లాగారు. మనీలాండరింగ్ చట్టం కింద 12 మంది సెలెబ్రిటీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వీరిలో పూరి జగన్నాథ్, చార్మి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇవాళ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ముందుకు రానుంది. ఇక ఈ నెల 8న రానా దగ్గుబాటి, 9న రవితేజతోపాటు శ్రీనివాస్, 13న నవదీప్‌తోపాటు ఎఫ్ క్లబ్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనీశ్, 20న నందు, 22న తరుణ్ విచారణకు హాజరవ్వాల్సి ఉంది.
- Tags
తాజావార్తలు
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?