పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా ప్రధాన పాత్రధారులుగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నిర్మితమౌతున్న మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవలే తాజా షెడ్యూల్ ను మొదలు పెట్టారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన అందించడం విశేషం. అంతే కాదు… షూటింగ్ సమయంలోనూ త్రివిక్రమ్ దగ్గర ఉండి అన్నీ చూసుకుంటున్నట్టు లేటెస్ట్ గా మంగళవారం సాయంత్రం విడుదల చేసిన మేకింగ్ వీడియోతో అర్థమౌతోంది. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో భీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రను పవన్ కళ్యాణ్, అతనితో ఢీ కొట్టే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రను రానా చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ తాజా మేకింగ్ వీడియోతో తెలిపింది.
Read Also : చొక్కా విప్పిన… బాలీవుడ్ చోటా కండల వీరుడు!
విశేషం ఏమంటే… ఇప్పటికే పవన్ కళ్యాణ్ – క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమాను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం తమ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని ప్రకటించారు. మరి ఈ లెక్కన ఆయన తన చిత్రాన్ని ప్రీ పోన్ చేసుకుని ఈ యేడాది చివరిలో విడుదల చేస్తారా? లేక వచ్చే సంక్రాంతి తర్వాత రిలీజ్ చేస్తారా అనేది చూడాలి.