గ్లోబల్ స్టార్ నందమూరి హీరో ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మొదటి నుంచి సైలెన్స్ ను మెయింటైన్ చేస్తూ.. వరుస సినిమాలతో జనాలకు దగ్గరయ్యాడు.. గతంలో చేసిన సినిమాలు ఒక ఎత్తు.. త్రిపుల్ ఆర్ తర్వాత చేసిన సినిమాలు ఒక ఎత్తు.. ఆ సినిమాలో తన నటనతో యావత్ సినీ ప్రజలను ఆకట్టుకున్నాడు.. ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు.. ప్రస్తుతం దేవర లో నటిస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలీవుడ్ తార జాన్వీ కపూర్ నటిస్తోంది. ప్రస్తుతం తారక్ ఒక్కో సినిమాకు దాదాపు రూ.100 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నాడని తెలుస్తోంది.
ఇకపొతే.. తారక్ కు కార్లంటే అమితమైన ప్రేమ. అలాగే ఖరీదైన లగ్జరీ వాచ్ కలెక్షన్ ఉంది. నిత్యం తారక్ లైఫ్ స్టైల్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. గతంలో అనేకసార్లు తారక్ ధరించిన వాచ్ గురించి సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపించాయి.. ఇప్పుడు ఓ ఈవెంట్ లో ఎన్టీఆర్ ధరించిన మరో వాచ్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి.. మేడం మూవీ ప్రమోషన్లలో భాగంగా యంగ్ హీరో సంగీత్ శోభన్.. తారక్ ను కలిశారు. వీరిద్దరికి సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది..
ఆ ఫొటోలో ఎన్టీఆర్ ధరించిన వాచ్ ధర విని అభిమానులతో పాటు, జనాలు కూడా షాక్ అవుతున్నారు.. అందులో తారక్ ధరించిన వాచ్ పైనే అందరి దృష్టి పడింది. ఆ వాచ్ స్విస్ లగ్జరీ బ్రాండ్ MB&F కు చెందినది. ఈ గడియారం అత్యద్భుతమైన ధర ట్యాగ్, దృష్టిని ఆకర్షించడం, ఆకర్షణీయంగా ఉండటం వల్ల స్పాట్‌లైట్‌గా ఉంది.. ఈ వాచ్ ధర అక్షరాల రూ.1.66 కోట్లు.. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తారక్ దేవరలో కనిపించనున్నారు. ఇందులో జాన్వీ కపూర్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. అలాగే ఇందులో సైఫ్ అలీ ఖాన్ కూడా విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ ను రెండు భాగాలుగా తీసుకువస్తున్నట్లు ఇటీవలే డైరెక్టర్ కొరటాల శివ అనౌన్స్ చేశారు. ఇందులో తారక్ మరోసారి ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి.. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది..