చెప్పులేసుకుని ఫోటో దిగినందుకు నటి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ టీవీ సీరియల్ నటి నిమిషా చెప్పులేసుకుని ఫోటో తీసుకోవడం అరెస్ట్ కు దారి తీసింది. అయితే చెప్పులేసుకుని ఫోటోలు దిగితే తప్పేంటట ? అని అడగకండి. అసలు విషయం తెలిస్తే మీరు కూడా ఆమెకు అక్షింతలు వేయకుండా ఉండరు. ఆమె చెప్పలేసుకుని ఏకంగా ఓ దేవుడి ఉత్సవ పడవలోకి వెళ్ళి అక్కడ ఫోటోలు దిగిందన్న మాట. దేవాలయ ఆచారాలను ఉల్లంఘించింది అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ బ్యూటీని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం నిమిషాను అరెస్టు చేసి, ఆమె స్టేట్మెంట్ నమోదు చేశారు పోలీసులు. ఈ విషయాన్ని స్వయంగా పోలీసులు తెలియజేశారు. నిమిషాతో పాటు ఆమె ఫోటోలు తీసిన స్నేహితుడి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే ఆ తర్వాత ఇద్దరూ బెయిల్‌పై విడుదలయ్యారు.
నిమిషా కొంతమంది స్నేహితులతో కలిసి ప్రసిద్ధ ఆరన్ముల దేవాలయంలోని పల్లియోదంలోకి వెళ్ళింది. అదే సమయంలో అతను అక్కడ ఉన్న దేవుడి ఉత్సవ పడవలో ఫోటోలు తీసుకున్నారు. అది కూడా చెప్పులు వేసుకుని. ఆమె ఈ ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకోవడం వివాదానికి దారి తీసింది. నెటిజన్లు, హిందూవాదులు ఆమెపై ఫైర్ అవ్వడంతో ఆ ఫోటోలను ఆమె డిలీట్ చేసింది.
Also Read
- 600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
- Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
- 200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
Read Also : గర్ల్ ఫ్రెండ్ పేరు బయట పెట్టేసిన షణ్ముఖ్
అయితే విషయం ఇక్కడితో ఆగలేదు. పుతుకులంగర పల్లియోడం సేవా సమితి ఆలయ నియమాలను ఉల్లంఘించినందుకు, మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు తిరువళ్ల పోలీస్ స్టేషన్లో నిమిషాపై ఫిర్యాదు నమోదు చేసింది. ఈ విషయం మరింత కావడం, బెదిరింపులు ఎదురవడంతో నిమిషా కూడా తనను బెదిరించిన వారిపై ఫిర్యాదు నమోదు చేసింది. అంతేకాదు తాను పొరపాటు చేశానని ఒప్పుకుంది. నాకు ఆ పడవలోకి ఎక్కడం తప్పు అనే విషయం తెలియదు. అది తెలియగానే ఫోటోలను డిలీట్ చేశానని, అయినప్పటికీ తనకు, తన కుటుంబానికి తెలియని వ్యక్తుల నుండి బెదిరింపులు వస్తున్నాయని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ చెప్పింది.
పంపా నదిలో సాంప్రదాయ పద్ధతిలో దేవుడి ఊరేగింపును నిర్వహించడానికి ప్రసిద్ధ ఆరన్ముల ఆలయంలో పల్లియోదం లేదా పాము పడవలను ఉపయోగించడం ఆచారం. ఇక చెప్పులు ధరించితిన్ ఆలయంలోకి ప్రవేశించడం నిషేధం అన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్‌లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్‌గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్‌కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..