గర్ల్ ఫ్రెండ్ పేరు బయట పెట్టేసిన షణ్ముఖ్

“బిగ్ బాస్ 5″లో షణ్ముఖ్ జశ్వంత్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వారం గడుస్తున్నా షణ్ముఖ్ మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నాడు. అసలు హౌస్ లో షణ్ముఖ్ ఉన్నాడా ? లేదా ? అనే అనుమానం కలుగుతోంది. అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ వల్ల లోబోకు షణ్ముఖ యజమానిగా నటించాల్సి వచ్చింది. ఈ రీజన్ తోనే లోబో చేసే పనుల వల్ల స్క్రీన్ స్పేస్ దక్కించుకోగలిగాడు. అయినప్పటికీ నాగార్జున సైతం “అరె ఏంట్రా ఇది… కాస్త కన్పించరా… కొంచం మాట్లాడరా… గేమ్ స్టార్ట్ చెయ్ రా… వారం అవుతోందిరా” అంటూ ఫన్ చేయడం నిన్నటి ఎపిసోడ్ లో హైలెట్ గా నిలిచింది.

Read Also : బిగ్ బాస్ 5 : ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరంటే ?

ఇక ఇందులో భాగంగానే షణ్ముఖ్ తన గర్ల్ ఫ్రెండ్ పేరును బయట పెట్టాడు. షణ్ముఖ్ ఒక పిల్లోను ఎప్పుడూ దగ్గరే పెట్టుకుంటాడని, దానిపై రెండు లెటర్స్ ఉన్నాయని ఇంటి సభ్యులు చెప్పడంతో నాగార్జున కూడా షణ్ముఖ్ ను ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అని ప్రశ్నించాడు. దానికి షణ్ముఖ్ సిగ్గుతో పదహారు వంకలు తిరిగిపోతూ దీప్తి అని చెప్పేశాడు. షోలో అది హైలెట్ చేయకపోయినా ప్రేక్షకులకు మాత్రం స్పష్టంగా విన్పించింది. గతంలో నుంచే వీరిద్దరి రిలేషన్ గురించి చాలా వార్తలు వచ్చాయి. అప్పుడు షణ్ముఖ్ గానీ, అటు దీప్తి గానీ పెద్దగా స్పందించలేదు. కానీ షణ్ముఖ్ బిగ్ బాస్ వేదికగా వాళ్ళ లవ్ స్టోరీని బయట పెట్టేశాడు. కాగా దీప్తి సునయన కూడా “బిగ్ బాస్” మాజీ కంటెస్టెంట్ అన్న విషయం తెలిసిందే.

Related Articles

Latest Articles

-Advertisement-