ప్రకాష్ రాజ్, నాగబాబుకి షాక్.. రాజీనామాలు తిరస్కరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్ష స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన ప్రకాశ్ రాజ్ ప్యానెల్ రాజీనామాలతో పాటు నాగబాబు రాజీనామాను కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ తిరస్కరించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు వాడి వేడిగా జరిగాయి.
సాధారణ ఎన్నికలను తలపించాయి. విష్ణు ప్యానెల్, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నువ్వా నేనా అనేలా పోటీ పడ్డాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఎట్టకేలకు విష్ణు మంచు అండ్ టీమ్ ఈ ఎన్నికల్లో విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలు జరిగిన తీరుని తప్పు పడుతూ నాగబాబు, ప్రకాశ్ రాజ్ అండ్ ప్యానెల్ రాజీనామాలు చేశారు. మరోవైపు ప్రకాశ్ రాజ్ ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తీరుపై మండిపడ్డారు. ఆయన ఏకపక్షంగా వ్యవహరించారని, ఆయనపై వత్తిడి వచ్చిందని ఆరోపించారు ప్రకాష్ రాజ్.
Also Read
- బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
- 649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
- 48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
- Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొదటి సారి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యుల రాజీనామాలతోపాటు మేనిఫెస్టోలో ప్రకటించిన 14 అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలు, నాగబాబు రాజీనామాను ఈసీ తిరస్కరించింది. రాజీనామాలు విరమించుకుని పదవుల్లో కొనసాగాలని విజ్ఞప్తి చేస్తూ వారికి లేఖలు రాయాలని తీర్మానించారు. మరి ఈసీ నిర్ణయానికి ప్రకాశ్ రాజ్, నాగబాబు లు ఎలా స్పందిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
-
Tarique Rahman: నవంబర్‌లో భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
-
Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
-
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
-
TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..