Love Heart : కొందరు విద్యార్థులు పరీక్ష సమయంలో పరీక్షలో ఇచ్చిన ప్రశ్నకు సమాధానం రాకపోవడంతో వారికి నచ్చిన సినిమాను లేదా ఏదో ఒక విషయాన్ని నింపడం పరిపాటిగా చూస్తూనే ఉంటాం. మరికొందరైతే పరీక్షల్లో పాస్ చేయమంటూ పేపర్ రుద్దే వాళ్ళని అడిగే సంఘటనలు కూడా లేకపోలేదు. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ విద్యార్థి తాజాగా పరీక్షలో రాసిన జవాబును చూసి టీచర్ షాక్ అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Yoga at Golden Temple: గోల్డెన్ టెంపుల్‌లో యువతి యోగా.. సిక్కుల ఆగ్రహం..
పరీక్షలో గుండె బొమ్మ వేసి గుండె ఏ విధంగా పనిచేస్తుందోన్న విషయాన్ని రాయమని చెప్పగా.. విద్యార్థి గుండె బొమ్మను చక్కగా వెయ్యడమైతే వేశాడు. కాకపోతే., గుండెలోని నాలుగు గదులను ఐదుగురు అమ్మాయిలకు అంకితం చేశాడు. గుండెలోని నాలుగు గదులను హరిత, ప్రియ, రూప, పూజ, నమిత అంటూ పేర్లు రాయడమే కాదు గుండె ఎలా పనిచేస్తుందన్న విషయాన్ని కూడా చాలా చమత్కారంగా వివరించాడు. ప్రియా తనతో ఇంస్టాగ్రామ్ లో చాట్ చేస్తుందని అందుకు ఆమెను ఇష్టపడుతున్నట్లు తెలిపాడు.
Sumit Nagal : మరోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన టెన్నిస్ స్టార్..
ఇక రూప స్నాప్ చాట్ ద్వారా తనలో టచ్ లో ఉండే ఆమెకు అందంలో ఎవరు సాటిరారని, ఇక నమిత పక్కింట్లో ఉండే అమ్మాయి.. ఆవిడకు పొడవాటి జుట్టు, పెద్ద పెద్ద కళ్ళతో ఆకర్షిస్తుందని తెలిపారు. అలాగే పూజ తన మాజీ ప్రియురాలని ఆమని ఎప్పటికీ మర్చిపోలేనని కన్నీరు కారుస్తున్న చిన్న బొమ్మను కూడా జత చేశాడు. ఇక చివరిగా తన క్లాస్మేట్ హరితను సైతం ఇష్టపడుతున్నట్లుగా అందులో వివరించాడు. ఇక ఈ వివరణత్మకమైన గుండె బొమ్మను చూసిన టీచర్ జవాబును కొట్టేసి గుండె బొమ్మకు మాత్రం మార్కులు వేసింది. అంతేకాదు.. అతని తల్లిదండ్రులను స్కూలుకు పీల్చుకొని రావాల్సిందిగా విద్యార్థిని ఆదేశించారు. ఇక ఈ పేపర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఈ ఫోటోను చూసిన నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇందులో కొందరైతే.. ” స్టూడెంట్స్ రాక్.. టీచర్ షాక్..” అంటూ కామెంట్ చేస్తుండగా.. మరికొందరు గుండె బొమ్మను బాగా గీసినందుకు అలాగే వివరణ ఇచ్చినందుకు మరికొన్ని మార్కులు వేయవచ్చు అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.