Interesting Facts: కాళ్లకు వెండి పట్టీలు ధరించడంలో సైన్స్ దాగుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం అంటే ఆడవాళ్లకు ఎంత ప్రాణమో వేరేగా చెప్పన్నక్కర్లేదు. ఒళ్లంతా బంగారు ఆభరణాలు ధరించడానికి ఆడవాళ్లు ఎంతమాత్రం వెనుకాడరు. కానీ కాలిపట్టీల విషయంలో మాత్రం బంగారం కాకుండా వెండిని మాత్రమే ఆడవాళ్లు ధరిస్తారు. భారతీయ సంప్రదాయంలో మహిళలు వెండి పట్టీలు ధరించడం ఎప్పటినుంచో పాటిస్తున్న ఆచారం. ఆడవాళ్లే కాదు.. మగవాళ్ళు కూడా చేతులు, కాళ్ళకు వెండి కంకణాలు, కడియాలు ధరించేవారు. అయితే ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు. దీని వెనుక గొప్ప సైన్స్ కూడా ఉంది.
నిజానికి బంగారంతో పోలిస్తే వెండిలో గొప్ప వైద్య గుణాలు ఉంటాయి. వెండి ఆంటీ మైక్రో బయల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. వైరస్లు, బ్యాక్టీరియాలు శరీరంలోకి ప్రవేశించకుండా వెండి అడ్డుకుంటుంది. అలాగే గాయాలు త్వరగా తగ్గిపోవడంలో కూడా వెండి సహాయపడుతుంది. అందుకే వెండికి అంత విలువ. వెండికి బ్యాక్టీరియాను చంపే శక్తి ఉంది. వేల సంవత్సరాల క్రితం, నావికులు బ్యాక్టీరియాను నాశనం చేయడానికి వాటర్ బాటిళ్లలో వెండి నాణేలు వేసుకుని తర్వాత వాటిని తాగేవారట. దాని వల్ల వారు ఆరోగ్యకరమైన నీరు తాగుతున్నామని భావించేవాళ్లట.
Also Read
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
- India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
కాళ్లకు వెండి మాత్రమే ఎందుకు ధరిస్తారంటే.. ఒకప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా కాలినడకనే వెళ్లాల్సి ఉండేది. పూర్వం రవాణా వ్యవస్థ అంత గొప్పగా ఉండేది కాదు. దీంతో మట్టిదారుల్లో ఎన్నో కిలోమీటర్లు నడవాల్సి ఉండేది. అప్పుడు వైరస్లు, బ్యాక్టీరియాలు శరీరంలోకి ప్రవేశించకుండా వెండిని కాళ్లకు కంకణాలుగా ధరించేవాళ్లు. కాలి పగుళ్లను కూడా వెండి తగ్గిస్తుందనేది ప్రజల నమ్మకం. అంతేకాకుండా మహిళలు ఎక్కువ భాగం వంటగదిలో గడుపుతారు లేదా ఇతర శుభ్రపరిచే పనుల్లో బిజీగా ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిల్చుని ఎక్కువ పని చేయడం వల్ల మహిళలకు ఎక్కువగా పాదాల్లో నొప్పి వస్తుంది. ఈ నొప్పులు క్రమంగా వెన్ను, తుంటి వరకు కూడా పురోగమిస్తాయి. అయితే పాదాలకు పట్టీలు ధరించడం వల్ల పాదాల్లో నొప్పి రాకుండా చూసుకోవచ్చు. వెండి రక్త ప్రసరణను సులభతరం చేయడంతో నొప్పులు వెంటనే తగ్గిపోతాయి. వెండి ఆభరణాలు ధరించడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే మహిళలు వెండి పట్టీలను ధరిస్తుంటారు. అయితే ఈ కాలంలో సిమెంట్ రోడ్లు, వాహనాలు రావడంతో వెండి వాడకం తగ్గిపోతూ వస్తుంది. అయినా ఇప్పటికీ మన దేశంలో కాళ్లకు వెండి పట్టీలను ధరించాలనే ఆచారం పాటించేవాళ్లు చాలా మందే ఉన్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!