Kerala: వేగంగా వస్తున్న రైలు.. ట్రాక్ మధ్యలో పడుకున్న వ్యక్తి.. చివరికీ.. (వీడియో)
- కేరళలోని కన్నూర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన
- వేగంగా వస్తున్న రైలు
- ట్రాక్ మధ్యలో పడుకున్న వ్యక్తి
- చివరికి ఏమైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలోని కన్నూర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన బయటకు వచ్చింది. వేగంగా వస్తున్న రైలు నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఓ వ్యక్తి పట్టాల మధ్యలో పడుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఓ వ్యక్తి కన్నూర్ సమీపంలోని ట్రాక్ మధ్యలో పడుకోవడం.. రైలు అతనిపై నుంచి వెళ్ళడం చూడవచ్చు. ఈ ఘటన సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కన్నూర్- చిరక్కల్ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది.
READ MORE: Bandi Sanjay: ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు..
Also Read
- 150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
- IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
- ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
- 705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
రైల్వే పోలీసులు ఆ వ్యక్తిని పవిత్రన్‌గా గుర్తించారు. ఆయన వయసు 56 ఏళ్లు. పవిత్రన్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు రైల్వే పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళూరు-తిరువనంతపురం రైలు వేగంగా వస్తోంది. పవిత్రన్ ఫోన్లో మాట్లాడుతూ.. ట్రాక్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. రైలు రాకను గమనించలేక పోయాడు. రైలు దగ్గరకు రాగానే చూసి భయాందోళనకు గురయ్యాడు. పారిపోయే సమయం లేదు. దీంతో ట్రాక్ మధ్యలో పడుకున్నాడు. రైలు వెళ్లియాక సాఫీగా లేచి వెళ్లిపోయాడు.
READ MORE: CM Revanth Reddy: అప్పుడు పీసీసీగా.. ఇప్పుడు సీఎంగా.. మెదక్ చర్చిలో రేవంత్ రెడ్డి..
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు గుర్తించారు. ఓ అధికారి మాట్లాడుతూ.. “వీడియో చూసిన తర్వాత మేము కూడా ఆశ్చర్యపోయాం. వ్యక్తి ఆకారం చిన్నగా ఉంది కాబట్టి సురక్షితంగా బయటపడ్డాడు. ఈ వీడియోను చూసిన చాలా మంది ట్రాక్‌పై ఓ తాగుబోతు పడి ఉన్నాడని పుకార్లు వ్యాపించాయి. కానీ.. నేను తాగలేదని పవిత్రన్ స్పష్టం చేశాడు. తాను ప్రాణాన్ని కాపాడుకోవడానికి ట్రాక్ మధ్యలో పడుకున్నట్లు తెలిపాడు.” అని తెలిపారు.
In a miraculous escape, a middle-aged man from Chirakkal survived unscathed after a train passed over him in Pannenpara, Kannur. The incident occurred while the man was walking along the railway tracks.
According to eyewitnesses, he lay down on the tracks just as the train… pic.twitter.com/J2cgyHpDbZ
— South First (@TheSouthfirst) December 24, 2024
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్‌కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్‌కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!