GodFather-Bisleri: మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమా రీసెంట్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బిస్లెరీ వాటర్ బాటిళ్లపై ఆ మూవీ బొమ్మతో ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు సూపర్‌గుడ్ ఫిల్మ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బిస్లెరీ ప్రతినిధి తుషార్ మల్హోత్రా చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పరిమిత సంఖ్యలో వాటర్ బాటిళ్లపై గాడ్‌ఫాదర్ బొమ్మ గల లేబుళ్లను అతికించి అందుబాటులో ఉంచనున్నారు. తద్వారా రెండు సంస్థలకీ ఆశించిన మేరకు మార్కెటింగ్ జరుగుతుందని భావిస్తున్నారు.
మన దేశానికి చేరుకున్న ఐఫోన్ 14 ప్లస్
ఐఫోన్ 14 ప్లస్ మోడల్.. ఇండియన్ మార్కెట్లతోపాటు ఇతర దేశాల్లో ఈ రోజు నుంచి అందుబాటులో ఉంటుందని యాపిల్ సంస్థ తెలిపింది. ప్రారంభ ధరను 89,900 రూపాయలుగా నిర్ణయించారు. ప్రీఆర్డర్ చేసినవాళ్లు కూడా ఇవాళ్టి నుంచే డెలివరీలు అందుకుంటారని పేర్కొంది. ఈ లేటెస్ట్ మోడల్‌లో 6.7 ఇంచ్ డిస్‌ప్లే, అప్‌గ్రేడెడ్ డ్యూయెల్ కెమెరా సిస్టమ్, క్రాష్ డిటెక్షన్, ఎమర్జెన్సీ ఎస్‌ఓఎస్ వయా శాటిలైట్, ఏ15 బయోనిక్ అండ్ ఇంప్రూవ్డ్ బ్యాటరీ లైఫ్ తదితర స్పెసిఫికేషన్లు ఉన్నట్లు వివరించింది.
Dil Raju: ‘ఆదిపురుష్’ మొదటిరోజు నెగెటివ్ టాకే.. దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
ఇండియా వృద్ధి అంచనా తగ్గింపు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశ వృద్ధి అంచనాను ప్రపంచ బ్యాంకు 7.5 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతోపాటు ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానాలను కారణాలుగా చూపింది. వరల్డ్ బ్యాంకే కాకుండా ఇతర సంస్థలు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇండియా గ్రోత్ ఔట్‌లుక్‌ని క్రమంగా తగ్గిస్తున్న సంగతి తెలిసిందే. నొమురా సంస్థ ఇప్పటికే 5.4 నుంచి 4.7కి తగ్గించింది. మోర్గాన్ స్టాన్లీ 7.2 నుంచి 7కి కుదించింది. ఫిచ్ సంస్థ 7.8 నుంచి 7కి సవరించింది. ఏడీబీ మరియు ఆర్బీఐ 7.2 నుంచి 7కి సరిచేశాయి.
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఇవాళ మళ్లీ నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 100 పాయింట్లు కోల్పోయి 58121 వద్ద ట్రేడింగ్ అవుతోంది. నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయి 51945 వద్ద కొనసాగుతోంది. టైటాన్ కంపెనీ షేర్ల వ్యాల్యూ రికార్డ్ స్థాయిలో 6 శాతం పెరిగింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ గతంలో ఎన్నడూ లేనంతగా 82 దాటింది. డాబర్, నైకా, హెచ్‌సీఎల్ టెక్, మహింద్రా లైఫ్, క్వెస్ కార్ప్ స్టాక్స్ ఆశాజనకంగా ఉన్నాయి.
