GodFather-Bisleri: మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమా రీసెంట్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బిస్లెరీ వాటర్ బాటిళ్లపై ఆ మూవీ బొమ్మతో ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు సూపర్‌గుడ్ ఫిల్మ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బిస్లెరీ ప్రతినిధి తుషార్ మల్హోత్రా చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పరిమిత సంఖ్యలో వాటర్ బాటిళ్లపై గాడ్‌ఫాదర్ బొమ్మ గల లేబుళ్లను అతికించి అందుబాటులో ఉంచనున్నారు.